'ఓటుకు నోటు కోర్టు నిర్ధారిస్తుంది, ఈసీ కాదు': ఏసీబీకి డైరెక్ట్‌గా ఇవ్వలేమని కోర్టు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అవినీతి జరిగిందా? లేదా? అన్న దానిని న్యాయస్థానం నిర్ధారించాల్సి ఉంటుందని, అంతే తప్ప ఎన్నికల సంఘం కాదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

సాయంత్రం హైదరాబాదుకు గవర్నర్
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, హోంశాఖ కార్యదర్శులతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయిన విషయం తెలిసిందే. సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు తదితర అంశాల పైన చర్చించారు. సెక్షన్ 8 పైన స్పష్టత ఇవ్వాలని గవర్నర్ నరసింహన్ హోంశాఖను కోరారు.
హోంశాఖ అధికారులతో వెంటవెంటనే భేటీ అయిన గవర్నర్, హోంమంత్రితో రెండుసార్లు భేటీ అయ్యారు. ఇది ఉత్కంఠకు దారి తీస్తోంది. ఎప్పటిలా తన పర్యటన సాధారణమేనని చెప్పడం గమనార్హం. సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కోసం ఏసీబీ మెమో దాఖలు!
ఎఫ్‌ఎస్‌ఎల్ సమర్పించిన నివేదిక సీల్డ్ కవర్‌ను ఏసీబీ న్యాయస్థానం పరిశీలించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ సీల్డ్ కవర్‌లోని అంశాలను పరిశీలించేందుకు ఏసీబీ ఎస్పీ మల్లారెడ్డికి అనుమతి ఇచ్చారు.
సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నివేదికను ఏసీబీకి డైరెక్టుగా ఇవ్వలేమని, నివేదిక కాపీలు కావాలంటే ఏసీబీ మెమో దాఖలు చేయాలని కోర్టు సూచించింది. మెమోతో పాటు ఫోరెన్సిక్ అనుమతి లేఖ కావాలని కోర్టు స్పష్టం చేసింది.సీల్డు కవర్‌లో ఉన్న నివేదికను బహిర్గతం చేయలేమని కోర్టు తెలిపింది.
కాసేపట్లో నివేదిక కోసం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయనుంది. మరోవైపు, రేవంత్ అరెస్టుకు ముందు తెలంగాణ ఏసీబీ చిత్రీకరించిన ఆడియో, వీడియో టేపులు కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని ఈసీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications