వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండాపై చర్యలు తీసుకొండి : సీఈసీకి టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోన్న చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర‌రెడ్డి చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. విశ్వేశ్వరరెడ్డి, ఆయ అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ నేత దండే విఠల్ ... రజత్‌ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు.

action taken against konda vishweshar : trs leaders complaint to cec

పట్టుబడ్డ రూ.10 లక్షలు
ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురిచేస్తోన్న విశ్వేశ్వరరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల పోలీసులు చేపట్టిన దాడుల్లో విశ్వేశ్వరరెడ్డికి చెందిన 10 లక్షలు లభించాయని పేర్కొన్నారు. అందులో చేవెళ్ల అసెంబ్లీకి రూ.10 కోట్లు, చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి రూ.70 కోట్లు ఖర్చుపెట్టాలనే ఎస్టిమేషన్ పత్రాలు లభించాయని గుర్తుచేశారు. ఈ నగదుపై మీడియాలో వార్తలు కూడా ప్రసారమయ్యాయని పేర్కొన్నారు. కానీ తర్వాత ఆ నగదు తమవి కాదని సీఈవోకు ఫిర్యాదు చేయడం దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఈ ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకోవాని కోరామని, అందుకు సీఈవో కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారని పేర్కొన్నారు.

action taken against konda vishweshar : trs leaders complaint to cec

కొండా బంధువే

కొండా విశ్వేశ్వరరెడ్డి బంధువు సందీప్‌రెడ్డి వద్ద రూ. 10 లక్షల నగదు దొరికాయని చెప్పారు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. కానీ నగదుకు సంబంధించి సందీప్ రెడ్డికి సంబంధం లేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీనివాస్ రెడ్డి.

English summary
TRS leaders complained to Chief Electoral Officer Rajat Kumar for taking action against Congress vice-president Konda Vishweshwar Reddy, Vishweshwar Reddy wanted to take appropriate action against his followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X