మరో 'సిలికాన్ వ్యాలీ' గా హైదరాబాద్ లోని ఈ ఏరియా.. గచ్చిబౌలికి మించిన అభివృద్ధి..!

హైదరాబాద్ మహా నగరం రోజురోజుకూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇటీవలి కాలంలో క్రమంగా పుంజుకుంటోంది. అటు ఐటీ రంగం కూడా హైదరాబాద్ నగరంలో గణనీయంగా విస్తరించింది. గచ్చిబౌలి ప్రాంతం వేదికగా ఐటీ కంపెనీలు ఏర్పడ్డాయి. గచ్చిబౌలి కేంద్రంగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు గచ్చిబౌలిని మించిన స్పీడ్ లో భాగ్యనగరంలోని ఓ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతం వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మహా నగరం ఒకటిగా ఉంది. ముంబై, దిల్లీ నగరాల తర్వాత హైదరాబాద్ నగరమే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పలు సర్వేలు చెబుతున్నాయి. భవిష్యత్తులోనూ మరింత అభివృద్ది చెందే అవకాశం ఉన్న నగరంగా రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు అలాగే రింగు రైలు, మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైనవి అని చెప్పవచ్చు. ఇక బెంగళూరు తర్వాత హైదరాబాద్ నగరమే ఐటీ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా పేరు పొందింది. అటు ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలోనూ హైదరాబాద్ సత్తా చాటుతోంది.

Adibhatla Emerges as Hyderabad s New Growth Hub Beyond Gachibowli

ఇక హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతం ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా అలరారుతోంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. అటు రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు కమర్షియల్ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. ఇక గచ్చిబౌలి తర్వాత కోకా పేట, మాదాపూర్ ప్రాంతాలు ఐటీ కంపెనీలకు నిలయంగా మారిపోతున్నాయి. అయితే ఆదిభట్ల ప్రాంతం భవిష్యత్తులో మరొక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆదిభట్ల ప్రాంతంలో TCS, Cognizant, Tata Advanced System, Amazon Data Center, Foxconn Company తదితర సంస్థలు ఏర్పాటు చేశారు. Tata Aero Space, Gold Sez, kaynes Technology Limited, E-Sez, E-City, Hardware Park వంటి సంస్థలు కూడా ఈ ప్రాంతంలో త్వరలో ఏర్పాటు కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+