మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా బారినపడిన గర్భిణీకి ప్రసవం నిరాకరణ, గేటు వద్దే..: ఇద్దరు వైద్యులపై వేటు

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: కరోనా వైరస్ మహమ్మారి కాలంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అనేక మంది బాధితుల ప్రాణాలు నిలబెట్టిన వైద్యులను చూశాం. వారందరికీ దేశం యావత్తు ప్రశంసలు కురిపించింది. అయితే, నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రం ఇద్దరు వైద్యులు కరోనా బారిన మహిళకు ప్రసవం చేసేందుకు నిరాకరించి ఆ వృత్తికి మచ్చతెచ్చారు. అంతేగాక, ప్రభుత్వ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు.

కరోనా బారినపడి గర్భిణీకి ప్రసవం నిరాకరణ

కరోనా బారినపడి గర్భిణీకి ప్రసవం నిరాకరణ


నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా బారినపడి అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ కి వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి నిరాకరించారు డాక్టర్లు. దీంతో ఆస్పత్రి గేట్ వద్దే ఆమె ప్రసవించింది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం సీరియస్ అయ్యింది. సూపరింటెండెంట్‌ కృష్ణ, డ్యూటీ డాక్టర్‌ హరిబాబును సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కి ఆదేశాలు ఇచ్చారు.

మరో ఆస్పత్రికి వెళ్లాలంటూ వైద్యులు

మరో ఆస్పత్రికి వెళ్లాలంటూ వైద్యులు

నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలం బాణాలకు చెందిన నిమ్మల లాలమ్మకు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు 10 గంటలకు కోవిడ్ టెస్ట్ చేయించగా, పాజిటివ్ వచ్చింది. దీంతో డాక్టర్లు ప్రసవం ఇక్కడ చేయలేమని.. పీపీఈ కిట్స్(PPE Kits)కూడా లేవని చెప్పారు. అప్పటికే ఆ మహిళకు నొప్పులు ఎక్కువ కావడంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని విధుల్లో ఉన్న డాక్టర్ హరిబాబు సూచించారు.

నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి గేటు వద్దే ప్రసవం

నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి గేటు వద్దే ప్రసవం

అప్పటికే నొప్పులు ఎక్కువ అవడంతో ఆస్పత్రి గేటు వద్ద ఓ మూలకు తీసుకెళ్లగా అక్కడే ప్రసవించింది సదరు మహిళ. ఆ తర్వాత అప్రమత్తమైన సిబ్బంది బిడ్డను, తల్లిని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. డ్యూటీ డాక్టర్ హరిబాబు బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారని, వారే వెళ్లలేదన్నారు.

Recommended Video

Viral Video : ఈ మహిళ ఎంత అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో చూశారా ? || Oneindia Telugu
మంత్రి హరీశ్ రావు ఆగ్రహం.. ఇద్దరు వైద్యుల సస్పెన్షన్

మంత్రి హరీశ్ రావు ఆగ్రహం.. ఇద్దరు వైద్యుల సస్పెన్షన్


ఈ ఘటన వివరాలు తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇద్దరు వైద్యులను సస్పెన్షన్‌ చేసిన వైద్య విధాన పరిషత్‌ .. మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కాగా, గర్భిణీలకు కొవిడ్ సోకినా, ప్రసవం కోసం వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యం నిరాకరించవద్దని, అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హారీశ్‌రావు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే.

English summary
Admission denied to a pregnant woman who had tested positive for covid 19: achampet chc superintendent, doctor suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X