అప్పుడే మొదలైందా?: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీకి అందిన ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదులు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగినఅవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ACB)కి ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కల్వకుంట్ల కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు రాపోలు భాస్కర్. వీరితోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు.

తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న రాపోలు భాస్కర్.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. దీనిపై ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలోనే తేలనుంది.
అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసే ఈ ఫిర్యాదు చేశారా? లేక వ్యక్తిగతంగానే కంప్లయింట్ చేశారా? అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని, అవినీతి డబ్బులను తిరిగి ప్రజలకు చేరేలా చూస్తామని పదే పదే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కోట్లలో బకాయిలు: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్‌కు నోటీసులు
నిజామాబాద్: ఆర్మూర్‌లోని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డికి చెందిన మాల్‌కు టీఎస్ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ. 8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్‌లో అనౌన్స్ చేశారు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో మాల్‌లోని షాపుల యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మాల్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అంతేగాక, జీవన్ రెడ్డికి చెందిన మాల్‌కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. కాగా, విద్యుత్ శాఖకు రూ. 2 కోట్ల బకాయి ఉండటంతో గతంలోనే నోటీసులు అందించారు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications