వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ నజియా 30 ఏళ్ల ఆరాటం..! తల్లిని చేరిన కూతుళ్లు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జ్ఞాపకం గాయమై వేధిస్తూ ఉంటుంది.. బ్రతకు పోరాటం పాతబస్తీ-అరబ్ ల మధ్య విలవిలలాడుతుంటుంది. ఎన్నెన్ని జ్ఞాపకాలు మనసు చుట్టు ముసిరినా.. నిరీక్షణకు నిస్సహాయతకు మధ్య 30 ఏళ్ల నిట్టూర్పులను భారంగా మోసుకుంటూ.. ఆశ లేని ప్రయాణమేదో ధీనంగా సాగుతూనే ఉంటుంది. బిడ్డలెప్పుడు తారసపడుతారో తెలియదు..! అయినా ఎక్కడో చిన్న ఆశ..

మూడు దశాబ్దాల క్రితం ఓ అరబ్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న నజియా బేగం ధీన గాథ ఇది. 1981లో అరబ్ కు చెందిన రషీద్ ఈద్ మస్మరీతో సంతోష్ నగర్ కు చెందిన నజియా బేగం వివాహం జరిగింది. అనంతరం అరబ్ లో కాపురానికి వెళ్లిన నజియాకు ఊహించని షాక్..!, అప్పటికే తన భర్తకు వివాహమయ్యిందన్న విషయం నజియాకు తెలిసింది.

విషయం తెలిసినా.. ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి మౌనంగా సర్దుకుపోయింది. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లకు తల్లి కూడా అయింది. ఆ తర్వాతే సదరు భర్త గారి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. విడాకులు కావాలంటూ వేధించడం మొదలుపెట్టిన రషీద్, చిన్నారుల ముందే నజియాను నరకయాతన పెట్టేవాడు. ఆఖరికి విడాకులు ఇస్తావా.. బిడ్డలను కాకుండా చేసుకుంటావా..? అని బెదిరింపులకు పాల్పడ్డాడు, పిల్లలద్దరిని దాచేశాడు.

ఓవైపు భర్త వేధింపులు.. మరోవైపు పిల్లలు ఇక కనిపించరన్న ఆవేదన.. అన్ని దిగమింగుకుని మళ్లీ సంతోష్ నగర్ లో అడుగుపెట్టింది నజియా. అయితే తల్లిదండ్రులకు భారం కావద్దని బీదర్ కు చెందిన ఓ పండ్ల వ్యాపారిని రెండో వివాహం చేసుకుంది. ఆ క్రమంలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన నజియా.. తన మొదటి ఇద్దరు ఆడపిల్లలు గుర్తొస్తే మాత్రం కన్నీటి పర్యంతమయ్యేది. అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితితో మళ్లీ అరబ్ వెళ్లి బిడ్డల కోసం ఆరా తీయడం 'కల' గానే తోచింది.

అయితే అదే నిర్వేదంలో బ్రతుకుతున్న నజియాను.. బిడ్డలే వెతుక్కుంటూ రావడం, ఆమెకు కొత్త ఊపిరి పోసినట్టయింది.. మిగతా వివరాలు స్లైడ్స్ ద్వారా..

నజియా కూతుళ్లు..

నజియా కూతుళ్లు..

అయేషా రశీద్(29), ఫాతిమా (రశీద్ 26) ఎలాగైనా తల్లిని ఆచూకీ కనుక్కోవాలని హైదరాబాద్ చేరుకున్నారు

అమ్మ కోసం వెతికే ప్రయత్నాల్లో భాగంగా..

అమ్మ కోసం వెతికే ప్రయత్నాల్లో భాగంగా..

గత జనవరిలో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణను కలిసి, తమ తల్లిని ఆచూకీ తెలుసుకోవాలని ప్రాధేయపడ్డారు.

తల్లి ఫోటో తీసుకున్న డీసీపీ కరపత్రాలు

తల్లి ఫోటో తీసుకున్న డీసీపీ కరపత్రాలు

వాల్ పోస్టర్ల ద్వారా.. ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చివరకి ముస్లిం వివాహాల కార్యాలయంలో నజియా ఆచూకీ పట్టుకోగలిగారు.

నజియా బీదర్ లో ఉంటున్నట్లు తెలియడంతో..

నజియా బీదర్ లో ఉంటున్నట్లు తెలియడంతో..

పోలీసులు అక్కడకు వెళ్లి విషయాన్ని నజియాకు వివరించారు. 'చిన్న కూతురికి ఆరు వేళ్లు' అని నజియా వివరించడంతో, పోలీసులు విషయాన్ని ధ్రువీకరించుకున్నారు.

అలా మొత్తానికి..

అలా మొత్తానికి..

పురానాహవేలీ లోని డీసీపీ కార్యాలయంలో 30 ఏళ్ల తర్వాత ఆ తల్లీకూతుళ్లు కలుసుకున్నారు.

బిడ్డల మనాదిలోనే బ్రతుకుతున్న నజియాకు..

బిడ్డల మనాదిలోనే బ్రతుకుతున్న నజియాకు..

కూతుళ్లు కళ్లెదుట కనిపించే సరికి దు:ఖం ఆపుకోలేకపోయింది.

కూతుళ్లు అమ్మ కన్నీళ్లను తుడిచి..

కూతుళ్లు అమ్మ కన్నీళ్లను తుడిచి..

ఆమె ఒడిలో సేద తీరి.. అసలు ఈ జీవితానికి నెరవేరుతుందా..? అన్న ఆ తల్లి కోరికను మొత్తానికి నెరవేర్చారు.

English summary
After Thirty years A Mother met her daughters in Puranahaveli DCP south zone office. Their daughters who came from arab atlast approached their mother with the help of hyderabadi police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X