Crop Loan Waiver: వారికి కూడా రుణ మాఫీ చేస్తాం.. మంత్రి తుమ్మల..!
తెలంగాణలో రుణ మాఫీ కాలేదని చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా బీజేపీ రైతు హామీల సాధన దీక్ష చేసింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. బీజేపీ దీక్ష చేయడం వింతగా ఉందన్నారు. మిగిలిన రైతులకు కూడా రుణ మాఫీ చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన మాట కోసం అన్నదాతలకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేశామని తెలిపారు. మూడు దశల్లో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
మిగతా వారికి రుణ మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. 22 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వివరించారు. మిగతా వాటిలో 4 లక్షల ఖాతాల నిర్ధారణ జరగాలని.. ఈ పని పూర్తయితే రుణ మాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణ మాఫీ చేస్తామన్నారు. రుణ మాఫీ కానలేదని అన్నదాతలు ఆందోళన చెందవద్దని కోరారు. మొదట పంటలోపే రుణ మాఫీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన దాదాపు రూ. 2,700 కోట్లలో రూ.1300 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. అయితే తుమ్మల నాగేశ్వర రావు రైతు భరోసాపై మాత్రం స్పందించలేదు.












Click it and Unblock the Notifications