ఖమ్మం సభ వేళ మల్లిఖార్జున్ ఖర్గే ట్వీట్ వైరల్..!!

తెలంగాణలో ఇప్పుడు ఖమ్మం సభ రాకీయ సంచలనంగా మారింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ సభకు హాజరు కానున్నారు. సభలో భట్టివిక్రమార్కను సన్మానించనున్నారు. అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ ప్రజలకు ఏం అందించేది రాహుల్ వివరించనున్నారు. ఈ సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆసక్తికర ట్వీట్ చేసారు.

ఖమ్మం సభకు ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తోందిన టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బస్సులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలల కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సభ కోసం తరలి వస్తున్నారని వివరిస్తున్నారు. సభ నిర్వహణ వేళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేసారు. 3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. ఖమ్మంలో జరగనున్న జనగర్జన సభను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి కాంగ్రెస్ బ్లూ ప్రింట్ సిద్ధమైందని వివరించారు. సమాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ధికి మరియు పురోగతికి తాము కట్టుబడి ఉన్నామని ఖర్గే పేర్కొన్నారు.

chiefmallikarjunkharge

ఈ సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమరశంఖం పూరించనున్నట్లు వివరించారు. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1360 కిలోమీటర్ల మేర కొనసాగి ఖమ్మంలో ముగిసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని వివరించారు. ఈ సభలోనే మాజీ ఎంపీ తన అనుచరవర్గంతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి జూపల్లి, ఇతర ముఖ్య నేతలకు రాహుల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పుడు ఈ సభను సక్సెస్ చేయటం ద్వారా రాష్ట్రంతో ఎన్నికల సమరశంఖం పూరించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+