ఎమ్మెల్సీ జాబితాలో కమ్మ వర్గానికి నో ప్లేస్-గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రిస్క్ చేసిందా..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా అందులో కాంగ్రెస్‌కు 4 స్థానాలు, ఒకటి బీఆర్ఎస్‌కు వెళ్లింది. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించి ముందు చెప్పినట్లుగానే ఒకటి కమ్యూనిస్టులకు కేటాయించగా.. మరో మూడు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇందులో విజయశాంతి, శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ పేర్లను ప్రకటించింది. అయితే విజయశాంతి పేరు చివరి నిమిషంలో తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అద్దంకి దయాకర్ పేరు ముందునుంచే ప్రచారంలో ఉంది పైగా సీఎం రేవంత్ రెడ్డికి ఆప్తుడనే ముద్ర కూడా ఉంది. అయితే సామాజిక వర్గాల పరంగా చూస్తే కమ్మ సామాజిక వర్గానికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.
నిరాశలో కమ్మ సామాజిక వర్గం
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విడుదల చేసిన జాబితాలో కమ్మ సామాజిక వర్గానికి చోటు దక్కకపోవడం ఒక్కింత నిరాశ కలిగించింది. హైదరాబాదులో దాదాపుగా 5 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీరి ఓట్లు చాలా కీలకంగా మారుతాయి. ఇలాంటి తరుణంలో కమ్మ సామాజిక వర్గంకు కౌన్సిల్‌లో ప్రాతినిథ్యం లభించకపోవడం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గం నుంచి జెట్టి కుసుమ కుమార్ పేరు ప్రచారంలో ఉన్నింది. సీఎం రేవంత్ రెడ్డికి కూడా చాలా ఆప్తుడిగా అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్సీకి తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ కూడా కుసుమకుమార్ పలు సందర్భాల్లో బాహాటంగానే చెప్పుకొచ్చారు. అయితే చివరి నిమిషంలో కుసుమకుమార్ స్థానంలో విజయశాంతి పేరు చేరిందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

కుసుమకుమార్ అభ్యర్థిత్వాన్ని అడ్డుకున్న మహిళా ఎంపీ..?
తెలంగాణలో అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరబాదు పరిధిలో 5 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే వీరు చాలా కీలకంగా మారుతారు. అయినప్పటికీ హైకమాండ్ ఈ సామాజిక వర్గం వైపు తలెత్తి చూడకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ దక్కకుండా ఓ మహిళా ఎంపీ అడ్డుకున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో షికారు చేస్తోంది. తెలంగాణలోకి టీడీపీ జనసేన ఎంట్రీ కచ్చితంగా జరుగుతుందని..బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమిగా వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందనే వార్తలు వస్తుండటం, అప్పుడు తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గం కూటమి వైపు నిలుస్తుందనే వాదన కూడా తెరపైకి రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ కుసుమకుమార్‌ను పక్కన పెట్టిందని సమాచారం.అయితే తెరవెనుక ఓ మహిళా ఎంపీ చేసిన మంత్రాంగం కూడా బలంగా పనిచేసినట్లు వార్తలొస్తున్నాయి.
రేవంత్ చొరవతో విజయశాంతి లాస్ట్ మినిట్ ఎంట్రీ
ఇక విజయశాంతి అభ్యర్థిత్వం చివరి నిమిషంలో ఖరారు కావడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. ముందు నుంచి కుసుమ కుమార్ అనుకున్నప్పటికీ ఆయన్ను కాదనడంతో విజయశాంతి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. బీఆర్ఎస్ కేసీఆర్ అంటే ఒంటికాలుపై లేసే విజయశాంతి అయితేనే కరెక్ట్ అని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు కౌన్సిల్‌లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు విజయశాంతి అయితే ఇటు పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడంతో పాటు ప్రత్యర్థులను డిఫెన్స్ మోడ్‌లోకి నెట్టేసే చాకచక్యత ఉందనే అభిప్రాయం కాంగ్రెస్ హైకమాండ్‌లో ఉంది. అందుకే ఈ లేడీ స్టార్‌కు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ... ఆయన్ను కూడా అడ్డుకునే ప్రయత్నం తెరవెనుక జరిగిందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ విధేయుడిగా అద్దంకి దయాకర్‌కు ముద్ర ఉంది. రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేయగా స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును సైతం త్యాగం చేశాడు. దీంతో తనకు తప్పక న్యాయం చేస్తానంటూ ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కౌన్సిల్‌కు పంపి అద్దంకి దయాకర్‌కు మాట నిలబెట్టుకున్నారు.
మొత్తానికి కొన్ని రోజులుగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరా అనే సస్పెన్స్‌కు తెరపడింది. ఎమ్మెల్సీ అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం అన్ని కోణాలలో ఆలోచించి అభ్యర్థుల ఎంపిక చేసిందన్నారు.గత 30 ఏళ్లుగా పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్‌కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చినట్లయ్యిందన్నారు.
-
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications