• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెరాస వైపు అఖిలేష్ చూపు, మమతా బెనర్జీ ట్విస్ట్: చంద్రబాబు ప్రయత్నాలకు కేసీఆర్ చెక్!

|
  Federal Front vs Anti BJP Front: Mamata Banerjee, Akhilesh Yadav Are Which Side ?

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇటీవల ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు.

  కేసీఆర్ బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ఫ్రంట్‌ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే, చంద్రబాబు బీజేపీయేతర ఫ్రంట్ కోసం చూస్తున్నారు. ఇప్పటి వరకు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతిలు బీజేపీయేతర ఫ్రంట్ అయిన కాంగ్రెస్ వైపు ఉంటున్నట్లుగానే కనిపిస్తోంది. కానీ కేసీఆర్ ప్రయత్నాల అనంతరం తారుమారు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  చంద్రబాబుకు కేసీఆర్ షాకిస్తారా?

  చంద్రబాబుకు కేసీఆర్ షాకిస్తారా?

  తాజాగా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వారు కాంగ్రెస్ కూటమిలో ఉండే అవకాశాలపై అనుమానాలకు తావిస్తోంది. అదే జరిగితే చంద్రబాబు బీజేపీయేతర కూటమి, కాంగ్రెస్ అనుకూల కూటమికి షాక్ అని చెప్పవచ్చు.

  హైదరాబాద్ వెళ్లి, కేసీఆర్‌ను కలుస్తా

  హైదరాబాద్ వెళ్లి, కేసీఆర్‌ను కలుస్తా

  కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ... ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కేసీఆర్‌ చేస్తోన్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. దేశంలోని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొన్ని నెలలుగా జరుగుతున్నాయని, ఆ దిశగా కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు. తమ తమ రాష్ట్రాల్లో ఎన్నో మంచి పనులు చేసిన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకే వేదిక పైకి వచ్చేందుకు కలిసి రావాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమయ్యాయని, ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారన్నారు.

  మమతా బెనర్జీ ఇలా

  మమతా బెనర్జీ ఇలా

  మరోవైపు, మమతా బెనర్జీ తీరు బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీతోను విభేదిస్తున్నారా అనే చర్చ సాగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ప్రభుత్వాధికారులతో మమతా సమావేశమయ్యారు. కొందరు రైతు రుణాల మాఫీని ప్రకటిస్తున్నారని, నిజానికి ఇందువల్ల క్షేత్రస్థాయిలో రైతులకు లబ్ధి చేకూరుతోందా లేదా అనే దానిపై తాను ప్రస్తుతం సమాచారం సేకరిస్తున్నానన్నారు. అయితే, రైతు రుణాల మాఫీని ప్రశ్నించిన మమత నేరుగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన మాత్రం తీసుకు రాలేదు. బీజేపీ రైతు భీమా పథకం పైనా మమత సెటైర్లు వేశారు.

  మమత, అఖిలేష్ అటువైపు మొగ్గు చూపుతున్నారా

  మమత, అఖిలేష్ అటువైపు మొగ్గు చూపుతున్నారా

  రైతు రుణాలపై మమత వ్యాఖ్యలను చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఆమె దూరంగా ఉండనున్నారా అనే చర్చ సాగుతోంది. ఇందుకు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు కూడా తోడవుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇటీవల అధికారంలోకి రాగానే రైతు రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 11న మూడు రాష్ట్రాల ఫలితాలు వెలువడగానే మమతా బెనర్జీ ట్విట్టర్‌లో ఆయా రాష్ట్రాల ప్రజలకు అభినందనలు తెలిపారే కానీ, ప్రత్యేకించి కాంగ్రెస్‌‌కు అభినందనలు తెలపలేదు. ఇదే సమయంలో తెలంగాణలో విజయం సాధించగానే కేసీఆర్‌కు అభినందలు తెలిపారు. ఫలితాల వెలువడిన తర్వాత కొద్దిరోజులకు మమతా బెనర్జీని కోల్‌కతాలో కేసీఆర్ కలిశారు. దీంతో కేసీఆర్ చెబుతున్న కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ వైపు వారు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది.

  English summary
  Samajwadi Party chief Akhilesh Yadav on Wednesday congratulated Telangana Chief Minister K Chandrashekar Rao on his efforts to bring together federal front. Yadav, who was scheduled to meet KCR, said that he will personally go to Hyderabad and meet KCR. Lauding the Telangana chief minister’s effort, Yadav also slammed the incumbent Centre government and said that it had failed on all fronts.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X