హైదరాబాద్ లో తొలి పాజిటివ్ కేసు
ఆల్కహాల్ అలర్జీతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ వైద్యులు గుర్తించారు. ఆగ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 36 ఏళ్ల వ్యాపారవేత్తకు ఆల్కహాల్ అలర్జీ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. తెలంగాణలో ఇలాంటి కేసు వెలుగు చూడటం ఇదే ప్రథమం. ఇష్టమైన మద్యం బ్రాండ్‌ను తీసుకున్నప్పుడల్లా బాధితుడు ఆల్కహాల్ అలర్జీకి గురవుతున్నాడు. మద్యం తీసుకున్న ప్రతిసారీ తీవ్రమైన అలర్జీలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తేల్చారు.
ఆగ్రాకు చెందిన ఓ వ్యాపారి కొన్ని నెలల క్రితం ఒక పార్టీకి హాజరయ్యాడు. ఆ తర్వాత తల తిరగడం, పొడి దగ్గు రావడం, శరీరంపై దద్దుర్లు రావడం, ముఖం ఎర్రబడటం లాంటి లక్షణాలు కనిపించాయి. స్థానికంగా ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.

హైదరాబాద్ లోని ఓ అలర్జీ సెంటర్ కు రాగా, వైద్యులు అతడిని పరిశీలించి ఆల్కహాల్ ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్షల్లో ఆ వ్యాపారవేత్తకు ఆల్కహాల్ అలర్జీ పాజిటివ్‌గా తేలింది. అలాగే అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్టు, కంప్యూటర్ లగ్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేశారు. అతడి రక్తంలో హిస్టామిన్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో పాటు మసాలా, యాంటిజెన్, చికెన్, మటన్, వేరుశెనగ, హిస్టామిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు తేలింది.
ఆ వ్యాపారవేత్త ఆస్తమాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో అలర్జీ అనిపించే బ్రాండ్ కు దూరంగా ఉండాలన్నారు. ఆల్కహాల్ తీసుకునేముందు దాన్ని డైల్యూట్ చేయాలని, తాగేటప్పుడు హై హిస్టామిన్ ఫుడ్, స్నాక్స్ ను తీసుకోవద్దని సూచించారు.
మద్యం తాగడానికి ముందే యాంటిహిస్టామైన్ మాత్ర తీసుకోవాలని సలహా ఇచ్చారు. కార్క్ ఆధారిత మూతలతో ప్యాక్ చేసిన మద్యం బ్రాండ్‌లకు దూరంగా ఉండాలని, చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఆల్కహాల్ అలర్జీకి గురవుతున్నప్పటికీ గుర్తించలేకపోతున్నారని, ఇటువంటి అలర్జీ కేసులు చాలా ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications