Engineering Fees:ఇంజినీరింగ్ కోర్సు ఫీజు పెంపు..ఎంతంటే..?

Engineering Fees:ఇంజినీరింగ్ చేయాలనే కోరిక ఉన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈవార్త కొందరికి షాకిచ్చేదిగా ఉండగా మరికొందరికి ఊరటనిచ్చేదిగా ఉంటుంది.ఇంజనీరింగ్ కోర్సు చదవాలనే మీ పిల్లలు ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే TG EAPCET పరీక్షలో మంచి ర్యాంకు సాధించి మంచి కాలేజీలో సీటు సంపాదిస్తే సంతోషమే. కానీ మంచి ర్యాంకు రాకుండా, ఇష్టమైన బ్రాంచ్ తీసుకుని మేనేజ్‌మెంట్ కోటాలో మంచి కాలేజీలో చదవాలని అనుకుంటే మాత్రం మీ జేబులకు చిల్లు పడటం తప్పదు. ఔను మీరు చదివింది నిజమే. మేనేజ్‌మెంట్ కోటాలో సీటు సంపాదించాలంటే మీరు డబ్బులు కుమ్మరించాల్సిందే. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీల్లో ఏడాది ఫీజు మూడురెట్లు పెరగనుంది.

ఉదాహరణకు ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ సీటు కన్వీనర్ కోటాలో రూ.లక్షగా ఉంటే అదే ప్రైవేట్ కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటా కింద అది అక్షరాల రూ.3 లక్షలు ఉంటుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ నిర్ణయం కచ్చితంగా కొన్ని వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతుంది.

Alert Engineering fees may increase three fold in the next academic year deets here

ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు పెంచకుండా ఉండేందుకు మేనేజ్‌మెంట్ కోటాకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియను పూర్తిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఇది రానున్న విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.దీంతో అడ్మిషన్ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోనుంది ఉన్నత విద్యామండలి.నీట్ రాసిన విద్యార్థులకు మేనేజ్‌మెంట్ కోటాలో ఎలాగైతే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను మెరిట్ ఆధారంగా ఫీజును వసూలు చేస్తున్నారో అలాంటి పద్దతినే ఇక్కడ కూడా అవలంబించాలని ఉన్నత విద్యామండలి ఆలోచన చేస్తోంది.

తెలంగాణలో మెడిసిన్, డెంటల్ సీట్లను కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి ప్రైవేట్ మెడికల్/డెంటల్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తోంది.ఇక్కడ మేనేజ్‌మెంట్ కోటాలో ఫీజు కన్వీనర్ కోటా ఫీజు కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుండగా అదే కేటగిరీ సీ అంటే ఎన్ఆర్ఐ సీట్ల ఫీజు మేనేజ్‌మెంట్ కోటా ఫీజు కంటే రెండు రెట్లు ఎక్కువగా నిర్ణయించారు.

ప్రస్తుతం ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 70శాతం సీట్లను తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (TG EAPCET)ద్వారా ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తోంది. మిగతా 30శాతం సీట్లు కాలేజీ యాజమాన్యం ప్రధాన వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చాక భర్తీ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం మేనేజ్‌మెంట్ మెరిట్ ప్రకారం సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఎన్ఆర్ఐ అభ్యర్థులు, ఆతర్వాత జేఈఈ మెయిన్,ఆ పై టీజీఈఎపీసీఈటీ ఆ తర్వాత 45శాతంకు తక్కువ లేకుండా ఇంటర్మీడియెట్లో మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు కేటాయించాలి.అయితే నిబంధనలు కేవలం పేపర్‌కే పరిమితయ్యాయి. వాస్తవానికి చాలా తక్కువ కాలేజీలు నిబంధనలను పాటిస్తున్నాయి.

ఇక చాలా ఏళ్లుగా మేనేజ్‌మెంట్ కోటాలో ఆయా కాలేజీల యాజమాన్యాలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై నియంత్రణ తీసుకురావాలంటూ పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి ఫీజు నియంత్రణపై ఆలోచన చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+