హైద‌రాబాద్ వాసుల‌కు అల‌ర్ట్‌.. సెప్టెంబ‌ర్ 23న పలు ప్రాంతాలలో నీటి సరఫరా బంద్‌..

హైదరాబాద్ వాసుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ నెల 23వ తేదిన నీటి స‌ర‌ఫ‌రా బంద్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. భాగ్య‌న‌గ‌రానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా ఫేజ్‌-3 రింగు మెయిన్‌ -1 పరిధిలోని ప్రశాసన్‌ నగర్‌ నుంచి అయ్యప్ప సోసైటీ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్‌ పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయ‌ని, ఈ లీకేజీల‌ను అరిక‌ట్టేందుకు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు చేప‌డుతున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. ఇందులో భాగంగానే న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాను బంద్ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఇక, ఈ మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు సెప్టెంబ‌ర్ 23వ తేదిన సోమ‌వారం ఉద‌యం 6గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు ఉంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలో తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Alert to the residents of Hyderabad Water supply shutdown in many areas on September 23

ఇక ఇందులో భాగంగానే ప‌లు ప్రాంతాల వాసుల‌కు అధికారులు ప‌లు సూచ‌న‌లు చేశారు. హకీంపేట, గోల్కొండ. టౌలిచౌకి, లంగర్‌హౌజ్‌, షేక్‌పేట, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌, తట్టిఖానా, మాదాపూర్‌, కొండాపూర్‌, డోమెన్స్‌, గచ్చిబౌలి ప్రాంతాల ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాల‌ని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+