హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అందరూ మోడీ వెంటే', 'బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో ధనం, రట్టు చేసేందుకు..'

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో డిజి ధన్ మేళా లక్కీ డ్రా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. లక్కీ డ్రా కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో డిజి ధన్ మేళా లక్కీ డ్రా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. లక్కీ డ్రా కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు.

చంద్రబాబు సొంతూర్లో ఏటీఎం..!: నారావారిపల్లెలో నారా రోహిత్ సందడిచంద్రబాబు సొంతూర్లో ఏటీఎం..!: నారావారిపల్లెలో నారా రోహిత్ సందడి

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన నోట్ల రద్దుకు దేశమంతా అండగా నిలబడిందన్నారు. నల్ల ధనం, అవినీతి, ఉగ్రవాద నిర్మూలనకు మోడీ చర్యలు చేపట్టారన్నారు.

రాష్ట్రంలో ఆర్బీఐ ద్వారా రూ.32వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. మరో పది రోజుల్లో రూ.400 కోట్లు తెలంగాణకు వస్తాయని చెప్పారు. కాగా, లక్కీ డ్రా నిర్వహించి 15వేలమందిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున బ్యాంకులు వారి ఖాతాల్లో జమ చేస్తాయి.

demonetisation

బ్యాంకులన్నీ వివరాలివ్వాలి

ఈ నెల 31వ తేదీలోపు అకౌంట్ల వివరాలు పంపని బ్యాంకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ నిఘా నేర పరిశోధన విభాగం డైరెక్టర్‌ బివి గోపీనాథ్‌ హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు తావులేదన్నారు.

నోట్ల రద్దు నేపథ్యంలో లావాదేవీల వివరాలను ఐటీకి ఎలా సమర్పించాలన్న వ్యవహారంపై చైతన్యం కలిగించేందుకు బుధవారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

చంద్రబాబు దారిలో..: నరేంద్ర మోడీకి రామ్‌దేవ్ బాబా ఝలక్చంద్రబాబు దారిలో..: నరేంద్ర మోడీకి రామ్‌దేవ్ బాబా ఝలక్

గత ఏడాది నవంబరు 9 నుంచి డిసెంబరు 30 వరకూ వివిధ ఖాతాల్లో జమ అయిన లావాదేవీల వివరాలు తమకు అందించాలన్నారు. పెద్దమొత్తంలో నల్లధనం బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలుస్తోందని, దీన్ని రట్టు చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోందన్నారు.

ఎవరైనా ఖాతాదారుడికి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ.12.5 లక్షలకు మించి జమ చేసిన వాటి వివరాలు పంపాలన్నారు. అలాగే సేవింగ్స్‌ ఖాతా అయితే రూ.2.5 లక్షలకు మించి జమ చేసిన వారి వివరాలు కూడా పంపించాలన్నారు. ఒకే వ్యక్తి వేర్వేరు ఖాతాలు నిర్వహిస్తుంటే వాటిని ఒకే ఖాతాగా పరిగణిస్తామన్నారు.

English summary
Union Minister Bandaru Dattatreya on Wednesday said that all over country with PM Modi over demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X