కాంగ్రెస్-ఎంఐఎం స్నేహం ఖాయమైందా? గ్రేటర్ సమీక్షలో రేవంత్ పక్కనే అక్బరుద్దీన్!
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గత సంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్ లో మజ్లిస్ అభ్యర్ధులకు గట్టిపోటీ ఇచ్చింది. గతంలో అధికార పార్టీలు మజ్లిస్ కు బలమున్న సీట్లలో డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టి చేతులు దులుపుకునేవి. అధికారంలోకి వచ్చాక మజ్లిస్ వారికి మద్దతిచ్చేది. అలాగే అధికార పార్టీలు మజ్లిస్ కు అండగా నిలిచేవి. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా ఈ సంప్రదాయానికి బ్రేక్ వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ కూడా మజ్లిస్ తో అదే బంధం నెరిపారు. కానీ తాజాగా కాంగ్రెస్ ఆ సంప్రదాయానికి మరోసారి బ్రేక్ వేస్తుందని అంతా భావించినా అలా జరగడం లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో తాము బీజేపీ-బీఆర్ఎస్ లతో కుమ్మక్కైందంటూ విమర్శించిన ఎంఐఎంతోనే స్నేహం మొదలుపెట్టేసింది. అసెంబ్లీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా కాదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రాధాన్యతలేంటో చెప్పేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రేటర్ హైదరాబాద్ పై తొలి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మజ్లిస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్ధానిక ఎమ్మెల్యేలను పిలవడంలో తప్పేమీ లేదు. కానీ అక్కడ అంతకు మించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏ రేవంత్ రెడ్డిని అయితే ఆరెస్సెస్ నేపథ్యముందని విమర్శించారో ఆయన పక్కనే కూర్చుని అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాల్ని పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీలు కూడా ఇచ్చేశారు. ఈ సమీక్షను నిశితంగా గమనించిన వారికి రేపు ఏం జరగబోతోందో ఇట్టే అర్ధమవుతోంది.

అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడం, అధికారం కోల్పోయాక వారి స్ధానంలో వచ్చే మరో పార్టీతో సంబంధాలు పెంచుకోవడం, హైదరాబాద్ పరిధిలో తమకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవడం ఎంఐఎం రాజకీయం. ఇప్పుడు కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. నిన్న మొన్నటివరకూ అండగా నిలిచిన బీఆర్ఎస్ ఓడిపోగానే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం అంటకాగడం మొదలుపెట్టేసింది. తెరవెనుక ఏ సంకేతాలు వెళ్లాయో తెలియదు కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ కావడం, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవని గ్రేటర్ పై రేవంత్ తొలి సమీక్ష పెట్టి ఎంఐఎం ఎమ్మెల్యేలను పిలవడం చూస్తుంటే వీరిద్దరి బంధం క్రమంగా బలపడుతున్నట్లు తెలుస్తోంది.
-
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications