28న తెలంగాణకు అమిత్ షా: మూడు జిల్లాల్లో కీలక సమావేశాలు

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఆరోజు మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు. అక్కడ్నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నేరుగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు.

పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 3:55 గంటలకు కరీంనగర్‌కు వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణంలో జరిగే పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొననున్నారు.

Amit Shah to visit telangana on January 28th

అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంటారు. హైదరాబాద్ పార్లమెంట్ క్లస్టర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీజేపీ నిర్వహించే మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆపై బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి 7.45 గంటలకు బయల్దేరి ఢిల్లీకి వెళ్తారు.

అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను బీజేపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫిబ్రవరి నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. మరో రెండు క్లస్టర్ మీటింగ్ లలో ఆయన పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+