Hyderabad: డాక్టర్ అంటూ నమ్మించాడు.. మత్తు మందు ఇచ్చి బంగారంతో ఊడాయించాడు..
మనం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అపరిచితులను అస్సలు నమ్మకూడదు. ముఖ్యంగా బస్సులు, ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నవారిని చూసి దొంగలు మాటామాట కలిపి బంగారం, డబ్బులు దోచుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి తాను వైద్యుడినని ఓ వృద్ధురాలిని నమ్మించి బంగారం నగలు తో పరారయ్యాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన సుజాత అనే వృద్ధురాలు జూన్ 2 తేదీన రైలులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది. ఈ రైలు ప్రయాణంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను వైద్యుడినని చెప్పాడు. హైదరాబాద్ నిమ్స్ లో సర్జన్ గా చేస్తున్నానని తెలిపాడు. చాలా మంచి వాడి లాగే సుజాతతో ప్రవర్తించాడు. నీరు తాగుతారా.. అంటూ అడిగాడు. ఇలా ఆమెకు నచ్చేలా చేశాడు.

దీంతో సుజాత తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అతనితో చెప్పింది. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పింది. అప్పుడు అతను మీరు ఏం ఇబ్బంది పడకండి సుజాతతో చెప్పాడు. తాను ఖాళీ ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాను.. అప్పుడు మీరు వస్తే మంచి మందులు ఇస్తానని చెప్పాడు. సుజాత ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు. బుధవారం అతను సుజాతకు ఫోన్ చేశాడు.
తాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వినాయక లాడ్జీ వద్ద ఉన్నానని అక్కడి రావాలని కోరాడు. ఇది నమ్మిన సుజాత అక్కడికి వెళ్లింది. సుజాత అక్కడి వెళ్లగానే నిందితుడు ఆమె రెండు మాత్రలు ఇచ్చి వేసుకోమ్మన్నాడు. ఆమె గోలీలు వేసుకోగానే నిద్రలోకి జారుకుంది. దీంతో అతను ఆమె పై ఉన్న బంగారం, ఆమెతో పాటు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లాడు. సుజాతకు స్పృహా రాగానే చూస్తే ఒంటి బంగారం లేదు.. బ్యాగు కూడా లేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications