ఐపిఎస్ రత్నకుమారి కొడుకు రోషన్ అనుమానాస్పద మృతి

హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్‌ ఐపీఎస్ క్వార్టర్స్‌లో మంగళవారం నాడు అనుమానాస్పదస్థితిలో ఐపిఎస్ అదికారి కొడుకు రోషన్ మృతి చెందాడరు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్‌లోని బంజారాహిల్స్‌ ఐపీఎస్ క్వార్టర్స్‌లో మంగళవారం నాడు అనుమానాస్పదస్థితిలో ఐపిఎస్ అదికారి కొడుకు రోషన్ మృతి చెందాడరు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ ఎస్పీ రత్నకుమారి కుమారుడు రోషన్‌ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. రోషన్‌ మృతిచెందినట్లు అర్థరాత్రి పోలీసులకు డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

Andhra cadre IPS Officer Ratna Kumari's son Roshan Suspicious death

కోర్టు పనుల కోసం రత్నకుమారి మంగళగిరి వెళ్లారు. రోషన్ కొన్నాళ్లుగా డ్రిపెషన్‌లో ఉన్నట్లు సమాచారం. రోషన్‌ మానసికస్థితిగా సరిగాలేదని ఏసీపీ మురళి చెప్పారు.రోషన్ కు ఆరోగ్యం బాగాలేదని, ఆ కారణంతోనే డిప్రషన్ లో ఉన్నాడని చెప్పారు ఏసీపీ మురళీ .

అయితే రోషన్ నిద్రమాత్రలు మింగేందుకు అనారోగ్యం కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరో వైపు కేసును అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. రోషన్ కాల్ డేటా పరిశీలిస్తున్నామని అన్నారు.

రోషన్ మృతిని అనుమానాస్పద మరణం కింద నమోదు చేశామని చెప్పారు. రత్నకుమారి ఇంటికి ఎవరైనా వచ్చారా? అన్న విషయాన్ని నిర్దారించేందుకు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, కుమారుడి మరణంతో చలించిపోయిన రత్నకుమారిని పలువురు సహోద్యోగులు ఓదార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+