అందులో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజ: ఢిల్లీ రిపోర్ట్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రైతు స్నేహ పూర్వక రాష్ట్రాల్లో వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాయి. ఫార్మర్స్ ఫ్రెండ్లీ స్టేట్‌లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నాయి.
నీతి అయోగ్ సూచిక సోమవారం నాడు విడుదలైంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి పది రాష్ట్రాలలో చోటు దక్కించుకున్నాయి. మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ఏపీ ఏడో స్థానంలో, తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
29 రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, అసోం, జార్ఖండ్, తమిళనాడు, జమ్ము కాశ్మీర్‌లు వెనుకంజలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. హర్యానా అయిదో స్థానంలో, హిమాచల్ ప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, గోవా, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. నీతి అయోగ్ తొలిసారి అగ్రికల్చర్ మార్కెటింగ్, ఫార్మర్స్ ప్రెండ్లీ రీఫార్మ్స్ సూచికను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు ఆ సెక్టారులో చేస్తున్న సంస్కరణలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంది.












Click it and Unblock the Notifications