‘నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే’..బాంబు పేల్చిన కీలక నేత

కాంగ్రెస్ పార్టీ అంటేనే మహాసముద్రం. కాంగ్రెస్ పార్టీలో ఎవరైన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వేచ్ఛ ఉంటోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. తనకు మంత్రి పదవి కావాలని కీలక నేత ఒకరు బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవి కావాలని చెప్పి తన మనసులోని మాట బయటపెట్టారు.

ఇంకా చెప్పాలంటే ఆయన తనకు మంత్రి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయనకు కుమారుడు అనిల్‌కు రాజ్యసభ పదవి అప్పగించారు. అయినప్పటికీ అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. కుమారుడుకు రాజ్యసభ ఇస్తే తనకు మంత్రి పదవి ఇవ్వరా అంటూ అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Anjan Kumar Yadav is demanding the post of minister

ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే అంజన్ కుమార్ యాదవ్ తన కోరికను బయటపెట్టారు. దీంతో కార్యకర్తల సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. వివాదం పెద్దది కావడంతో దీపాదాస్ మున్షీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే అంజన్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+