వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైద్రాబాద్: తలాక్ లపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సమయంలో మరోసారి హైద్రాబాద్ ఇదే అంశంపై చర్చనీయాంశంగా మారింది. ముదసీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి తనభార్యకు వాట్సాప్ లో తలాక్ చెప్పాడు.దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది.

2016 లో టోలిచౌకిలో నివాసం ఉండే ఏంబీఏ విధ్యార్థిని ముదసీర్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి వివాహం చేసుకొన్నాడు. 20 రోజులపాటు ఆ యువతితో అతను కాపురం చేశాడు.అయితే ఆ తర్వాత ఆయన రియాద్ వెళ్ళాడు.

talaq

ఆరుమాసాల పాటు తన భార్యతో ముదసీర్ అహ్మద్ ఖాన్ బాగానే ఉండేవాడు. ఆమెతో తరచూ ఫోన్ లో మాట్లాడేవాడు.అయితే గత ఏడాది సెప్టెంబర్ లో వాట్సాప్ లో ముదసీర్ అహ్మద్ ఖాన్ బాధితురాలికి వాట్సాప్ లో తలాక్ చెప్పేశాడు.

ఈ మేసేజ్ ను చూసిన బాధితురాలు తన అత్తింటికి వెళ్ళింది.అయితే బాధితురాలిని వారు ఇంట్లోకి రానివ్వలేదు. తమ కొడుకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడని ఆమెను ఇంట్లో అడుగుపెట్టనివ్వలేదు.తనకు విడాకులు ఇవ్వడానికి సరైన కారణాలు కూడ చెప్పలేదని బాధితురాలు వాపోయింది.

అంతేకాదు తలాక్ నామాను ముదసీర్ అహ్మద్ ఖాన్ లాయర్ ద్వారా పంపాడు.ఈ మేసేజ్ చూసి షాక్ కు గురైన భార్య పోలీసులను ఆశ్రయించింది.పోస్టు కార్డు మీద ఫోన్ లో తలాక్ లు చెప్పి విడాకులు పొందుతున్నారు భర్తలు.అయితే ఇటీవలనే హైద్రాబాద్ కు చెందిన ఇద్దరు అక్కా చెల్లెల్లు ఈ విషయమై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు.వీరిద్దరికి కూడ వారి భర్తలు ఫోన్ లో తలాక్ చెప్పారు.ఈ తలాక్ చట్టబద్దంగా కాదని తేల్చాలని వారు కోర్టును కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
One more case of divorce through whatsapp has come in to light in Hyderabad.Badar Ibraheem an MBA graduate was divorced by her husband through whatsapp.
Please Wait while comments are loading...