లోకేశ్‌కి టీ ఏసీబీ: కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్లకు ఏపీ సీఐడీ నోటీసులు..!

హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి కదలికలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సిఐడి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఎసిబి నోటీసు ఇవ్వగానే, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, తెలంగాణ మంత్రి కెటి రామారావు డ్రైవర్‌కు, గన్‌మన్‌కు ఎపి సిఐడి నోటీసులు జారీ చేసింది.

ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య కేసులో తెలంగాణ మంత్రి కెటి రామారావు గన్‌మెన్‌, డ్రైవర్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతోంది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలని మత్తయ్యను బెదించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏపీ సిఐడీ పోలీసులు విచారణ జరిపారు.

AP CID may serve notices to KTR's driver and gunman

కెటిఆర్ గన్‌మెన్‌, డ్రైవర్‌ల ఫోన్ల నుంచి మత్తయ్యకు కాల్స్‌ వచ్చినట్లు అధికారులు నిర్ణారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారిద్దరికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు స్ధిమవుతున్నారు. కాగా ఓటుకు నోటు కేసులో మత్తయ్య నాలుగో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ డ్రైవర్ కొండల్‌రెడ్డికి తెలంగాణ అవినీతి నిరోదక శాఖ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. గురువారం జరిగే విచారణకు హజరుకావాలని ఆ నోటీసులో సూచించారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి ఎసిబి అధికారులు నోటీసులు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+