వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేబడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు నిరాశ, బాబుకు 'అమరావతి'పై మోడీ చేయి! ఇవే...

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అంత ఆశాజనకంగా ఏమీ కనిపించలేదు. ప్రయాణీకులకు ఎన్నో తాయిలాలు ప్రకటించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల విషయంలో మాత్రం మొండిచేయి చూపారు.

ఏపీలో విశాఖ రైల్వే జోన్ గురించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ బడ్జెట్‍‌లోను విశాఖ రైల్వే జోన్ ఊసు లేదు. కేంద్రమంత్రి ఎలాంటి మాట మాట్లాడలేదు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగింపు విషయంలో కేంద్రమంత్రి మొండిచేయి చూపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. దీని విషయంలో తెలంగాణకు నిరాశ ఎదురైంది.

AP and Telangana states disappointed with Railway Budget 2016

ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఓ వరం ప్రకటించారు. దేశంలో తొలిసారి ఏర్పాటు చేయనున్న రైల్వే వర్సిటీని వడోదరకు కేటాయించారు. ఈ యూనివర్సిటీని నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కేటాయించాలని చంద్రబాబు ముందుగానే విజ్ఞప్తి చేసినా అది ప్రధాని సొంత రాష్ట్రానికి వెళ్లింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ రైల్వే బడ్జెట్ నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.

రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ప్రజలకు పైపై మెరుగులు తప్ప మరేమీ కనిపించలేదు. అటు పారిశ్రామిక వర్గాలకు సైతం అసంతృప్తినే కలిగించింది.

సామాన్యులకు అంత్యోదయ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రవేశపెడతామని, పుణ్యక్షేత్రాలకు కొత్త రైళ్లని, స్మార్ట్ బోగీలని, చార్జింగ్ పాయింట్లనీ, ఐవీఆర్ ఎస్ నంబర్లని, వైఫై అని... ఇలా టెక్నాలజీ చూపించారే తప్ప, ఓ రైలును పొడిగించడం, కొత్త రైళ్లను ప్రకటించడం, పాత ప్రాజెక్టులకు నిధుల మంజూరు వంటి విషయాల జోలికే పోలేదు.

AP and Telangana states disappointed with Railway Budget 2016

వైఫై సేవలను అందించేందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ముందుకు రాగా, దాన్ని ప్రభుత్వం అందించిన సౌకర్యంగా సురేష్ ప్రభు చెప్పుకున్నారు. పెట్టుబడుల కోసం పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టులు ఉంటాయన్నారు. రైల్వేల ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పకనే చెప్పినట్లయింది. ప్రజలపై చార్జీల భారం మోపకపోవడం ఒక్కటే ఈ బడ్జెట్ తరువాత సామాన్యుడికి కాస్త ఆనందం.

- తెలంగాణ, ఏపీలకు పెద్దగా ఏదీ దక్కలేదు. ఇవీ వచ్చాయి..
- విజయవాడ - ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా మార్గం
- నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్
- ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణకు కొత్త పథకం. ఈ పథకంలో మొదటి దశలోనే తిరుపతికి చోటు.
- తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు వంటివి బడ్జెట్‌లో కనిపించాయి.
- రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.
- కోటిపల్లి - నర్సాపురం లైనుకు రూ.200 కోట్ల నిధులు.
- పిఠాపురం - కాకినాడ లైనుకు రూ.50 కోట్లు కేటాయింపు.
- కాజీపేట - విజయవాడ మూడో లైనుకు రూ.114 కోట్లు.
- పెద్దపల్లి - నిజామాబాద్ లైన్‌కు రూ.70 కోట్లు.
- మాచర్ల - నల్గొండ లైన్‌కు రూ.20 కోట్లు.
- మునిరాబాద్ - మహబూబ్ నగర్ లైన్‌కు రూ.180 కోట్లు.
- కాజీపేట - వరంగల్ మధ్య ఆర్వోబి నిర్మాణానికి రూ.5 కోట్లు.
- సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు రూ.80 కోట్లు.
- పెద్దపల్లి - జగిత్యాల మధ్య సబ్ వే నిర్మాణానికి రూ.5 కోట్లు
- రాఘవాపురం - మందమర్రి లైన్‌కు రూ.15 కోట్లు

- నంద్యాల - ఎర్రగుంట్లకు రూ.50 కోట్లు
- ఓబులవారిపల్లి - కృష్ణపట్నంకు రూ.100 కోట్లు
- కడప - బెంగళూరు లైన్ అభివృద్ధికి రూ.29 కోట్లు
- నడికుడి - శ్రీకాళహస్తికి రూ.180 కోట్లు
- కుంభం - పొద్దుటూరుకు రూ.10 లక్షలు
- విజయవాడ - హైదరాబాద్ మధ్య డబుల్ డెక్కర్ రైలు
- విశాఖ - విజయవాడ మధ్య డబుల్ డెక్కర్
- ముతోడ్ - అదిలాబాద్‌కు రూ.1 కోటి.
- మనోహరాబాద్ - కొత్తపల్లికి రూ.20 కోట్లు
- గద్వాల్ - రాయచూర్ రూ.5 కోట్లు
- అక్కన్నపేట - మెదక్ రూ.5 కోట్లు
- నాగరాఘవపూర్ - మందమర్రి రూ.15 కోట్లు
- భద్రాచలం - కొవ్వూరు రూ.5 కోట్లు
- భద్రాచలం సత్తుపల్లి రూ.కోటి
- కొండపల్లి - కొత్తగూడెం రూ.10 కోట్లు
- డిచ్ పల్లి - నిజామాబాద్ ఓవర్ బ్రిడ్జికి రూ.10 కోట్లు
- బోధన్ నుంచి బీదర్ కొత్త లైను
- కొత్త మణుగూరు - రామగుండం కొత్త లైను

English summary
AP and Telangana states disappointed with Railway Budget 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X