Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఏపీ రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి, లింగంపల్లిలో దసరా స్టాప్స్..!

దసరా సందర్భంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. దీన్ని తట్టుకునేందుకు ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. అలాగే రైళ్ల రాకపోకల్లో, స్టాపుల్లో మార్పులు చేర్పులు చేస్తూనే ఉంది. అయినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ దక్షిణ మధ్య రైల్వే మరో కీలక ప్రకటన చేసింది. ఏపీ నుంచి వచ్చే పలు రైళ్లకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో తాత్కాలిక స్టాపులు ఇస్తున్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్ స్టేషన్ లో దసరా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఏపీ నుంచి వచ్చే జన్మభూమి, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, కాకినాడ-ముంబై లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో తాత్కాలిక స్టాప్ లు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకూ ఇలా ఆయా స్టేషన్లలో పలు రైళ్లకు తాత్కాలిక స్టాప్ లు ఇస్తున్నారు.

AP Trains to Get Temporary Stops at Hi-tech City Charlapalli and Lingampalli Stations SCR

విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు హైటెక్ సిటీ స్టేషన్లో సాయంత్రం 6.48కి స్టాప్ ఇచ్చారు. అలాగే లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు ఉదయం 6.20కి స్టాప్ ఇచ్చారు. విశాఖ-ముంబై లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు మధ్యాహ్నం 1.19కి, ముంబై ఎల్టీటీ-విశాఖ ఎక్స్ ప్రెస్ కు సాయంత్రం 7.25కు స్టాప్ ఇచ్చారు. అలాగే కాజీపేట-హడప్సర్ ఎక్స్ ప్రెస్ కు రాత్రి 9.04కు, హడప్సర్-కాజీపేట రైలుకు తెల్లవారు జామున 1.35కు స్టాప్ ఇచ్చారు.

అలాగే నర్సాపూర్-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ కు చర్లపల్లిలో తెల్లవారుజాము 3.44కు, హైటెక్ సిటీలో 4.44కు స్టాప్ లు ఇచ్చారు. లింగంపల్లి -నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ కు చర్లపల్లిలో రాత్రి 10.09కి, హైటెక్ సిటీలో రాత్రి 9.05కు స్టాప్ ఇచ్చారు. అలాగే కాకినాడ టౌన్-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ కు చర్లపల్లిలో ఉదయం 5.59కి స్టాప్ ఇచ్చారు. హైటెక్ సిటీలో 6.49కి స్టాప్ ఇచ్చారు. లింగంపల్లి-కాకినాడ టౌన్ ఎక్స్ ప్రెస్ కు చర్లపల్లిలో రాత్రి 8.04కి, హైటెక్ సిటీలో 7.05కు స్టాప్ లు ఇచ్చారు.

AP Trains to Get Temporary Stops at Hi-tech City Charlapalli and Lingampalli Stations SCR

లింగంపల్లి స్టేషన్లో సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్ ప్రెస్ కు ఉదయం 9.39కి స్టాప్ ఇచ్చారు. అలాగే దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ కు ససాసయంత్రం 7.59కి స్టాప్ ఇచ్చారు. లింగంపల్లి స్టేషన్లో సికింద్రాబాద్-రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ కు మధ్యాహ్నం 3.39కి, రాజ్ కోట్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ కు ఉదయం 6.09కి స్టాప్ ఇచ్చారు. సికింద్రాబాద్- పోరు బందర్ ఎక్స్ ప్రెస్ కు మధ్యాహ్నం 3.39కి, పోరు బందర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ కు ఉదయం 6.09కి స్టాప్ ఇచ్చారు. తిరుపతి-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ కు ఉదయం 5.34కి, సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్ ప్రెస్ కు మధ్యాహ్నం 3.24కి స్టాప్ ఇచ్చారు. సీఎస్టీ ముంబై-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ కు ఉదయం 10.59కి, హైదరాబాద్-సీఎస్టీ ముంబై ఎక్స్ ప్రెస్ కు మధ్యాహ్నం 3.19కి తాత్కాలిక స్టాప్ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+