తీహార్ జైలు నుంచి 4 పేజీల లేఖ విడుదల చేసిన కవిత: సంచలన విషయాలు వెల్లడి
Kalvakuntla Kavitha: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. మరి కొన్ని రోజుల పాటు ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగనున్నారు.
ఇదివరకు ఢిల్లీ రోస్ అవెన్యూ న్యాయస్థానం విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను ఈడీ అధికారులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కస్టడీ గడువు పొడిగించాలంటూ అభ్యర్థించారు. 14 రోజుల పాటు కస్టడీ కావాల్సి ఉంటుందంటూ పిటీషన్ దాఖలు చేశారు.

వాదనలను ఆలకించిన అనంతరం రోస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తులు ఈడీ తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీని తరలించాలని ఆదేశించారు. అనంతరం అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా కవిత నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుడల చేశారు. చేత్తో రాసిన లేఖ అది. రోస్ అవెన్యూ న్యాయమూర్తిని ఉద్దేశించి ఆమె ఈ లేఖ రాశారు. మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో తన ప్రమేయం లేదని వివరించారు. ఆర్థికంగా ఎలాంటి లబ్ది పొందలేదని పేర్కొన్నారు.
ఈ కేసులో తాను బాధితురాలినని పేర్కొన్నారు కవిత. రెండున్నర సంవత్సరాలుగా ఈడీ, సీబీఐ విచారణలు మీడియా ట్రయల్స్‌గా రూపుదిద్దుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఓ మహిళ రాజకీయ నాయకురాలిగా ఈ కేసు దర్యాప్తు ప్రక్రియలో తాను బాధితురాలిగా మారానని, తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బ కోల్పోతున్నానని పేర్కొన్నారు.
తన వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను అన్ని న్యూస్ ఛానళ్లల్లోనూ ప్రసారం చేశారని, ఇది నేరుగా తన ప్రైవసీని దెబ్బ తీసినట్టేనని కవిత పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తోన్నానని, గతంలో నాలుగు విచారణకు హాజరయ్యానని, ఈ సందర్భంగా తన బ్యాంకు, వ్యాపార వివరాలు, ఫోన్ నంబర్లన్నింటినీ వారికి అందజేశానని అన్నారు.

రెండున్నర సంవత్సరాలుగా దర్యాప్తు ఏజెన్సీలు విచారణ పేరుతో పలుమార్లు దాడులు చేశారని కవిత ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఈ కేసు మొత్తం కూడా స్టేట్‌మెంట్ల మీద ఆధారపడిందని వ్యాఖ్యానించారు కవిత. ఈ కేసును కొట్టివేయవచ్చంటూ జస్టిస్ సంజయ్ ఖన్నా కూడా అభిప్రాయపడ్డారని పేర్కొన్నారామె.
రెండున్నర సంవత్సరాల పాటు తనిఖీలు, సోదాల పేరుతో ఇబ్బందులకు గురి చేసిన తరువాత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేశారని, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం స్టేట్‌మెంట్ల మీద ఆధారపడ్డారని కవిత వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో ఈడీ/సీబీఐ నమోదు చేస్తోన్న 95 శాతం కేసులన్నీ కూడా ప్రతిపక్ష నాయకులపైనేనని కవిత అన్నారు. బీజేపీలో చేరితే ఈ దాడులు, కేసులు, విచారణలన్నీ ఆగిపోతాయంటూ ఆ పార్టీ నాయకులు బాహటంగానే చెబుతున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంట్‌లో సైతం బీజేపీ సభ్యులు ఇదే బెదిరిస్తోన్నారని విమర్శించారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications