• search
 • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మర్కజ్ వెళ్ళిన వారి వివరాలు సేకరిస్తున్న ఆశా వర్కర్లు .. దుర్భాషలాడి దాడికి యత్నం

|

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొదట కొంత స్లో గా అనిపించినా ఎప్పుడైతే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభ జరిగిందని , అందులో వారు ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారని తెలిసిందో అప్పటి నుండి ఊహించని విధంగా కేసులు పెరిగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపధ్యంలో కొంతమేర ప్రభావం తగ్గినా , ఢిల్లీ మత ప్రచార సభ మాత్రం కొంప ముంచేసింది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 3043 కేసులు నమోదవ్వగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు.

మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న సర్కార్

మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్న సర్కార్

ఈ క్రమంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లో పాల్గొన్న వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక జిల్లాల వారీగా వారిని గుర్తించే పనిలో పడ్డాయి. ఒక్క తెలంగాణా నుండే వెయ్యి మందికి పైగా ఈ సభకు వెళ్లి వచ్చారు. ఇక వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఈ నేపధ్యంలో ఆ సభకు వెళ్లి వచ్చిన వారు క్వారంటైన్‌లోనే ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

 టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి .. జిల్లాల వారీగా వారి కోసం జల్లెడ

టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి .. జిల్లాల వారీగా వారి కోసం జల్లెడ

అంతేకాదు అక్కడికి ఎవరెవరు వెళ్లారో స్వచ్ఛందంగా వచ్చి సమీప అధికారులకు వివరాలు తెలపాలని సూచించారు. అయినా చాలా మంది బయటకు రావటం లేదు . అయితే అక్కడికి వెళ్లి వచ్చి ఇప్పటి వరకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయితే ఆ సభకు వెళ్లి వచ్చిన వారిని గురించి ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. వారిని తక్షణమే గుర్తించి కరోన పరీక్షలు చేయించాలని సూచించింది. ఇక తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై సర్వే జరుగుతుంది . ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మర్కజ్ మీటింగ్‌లకు హాజరైన వారిని గుర్తించేందుకు ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు.

సర్వే చేస్తున్న ఆశా వర్కర్ పై దాడికి యత్నం

సర్వే చేస్తున్న ఆశా వర్కర్ పై దాడికి యత్నం

ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్‌లో ఓ ఆశా వర్కర్‌పై ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తి దాడికి పాల్పడ్డేందుకు ప్రయత్నించాడు. వివరాలు సేకరించటానికి వెళ్ళిన ఆశా వర్కర్ పై అతను ,అతని కుటుంబం దుర్భాషలాడుతూ దాడికి దిగబోయారు. దీంతో వెంటనే వారు అక్కడి నుంచి ఆమె డీ అండ్ హెచ్‌వో ఆఫీస్‌లో అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే చెయ్యాలంటే భయపడుతున్న ఆశావర్కర్లు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

  PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
   పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. రక్షణ కావాలని విజ్ఞప్తి

  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు .. రక్షణ కావాలని విజ్ఞప్తి

  అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లి ఫిర్యాదు చేసిన ఆమె తమకు రక్షణ లేదని వాపోయారు . అయితే ఆశా వర్కర్లు ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వ ఆదేశాల మేరకు , వారి ఆరోగ్యం కోసం సర్వే చేస్తుంటే వారిక సహకరించాల్సింది పోయి ఇలా దాడులకు పాల్పడుతున్న తీరు విస్మయం కలిగిస్తుంది. చాలా మంది మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు పోలీసులకు, వైద్యులకు సహకరించకపోవటం పరిస్థితి ఎలా మారుతుందో అన్న భయం ఆకలిగిస్తుంది.

  English summary
  A man tried to attack an Asha worker at Shivaji Chowk in Adilabad district while she is doing a survey on the people who went to markaj tablighi jamath meeting. He and his family were abusive and tried to attack the Asha worker who went to collect details. She immediately lodged a complaint with the authorities and police station.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more