స్పోర్ట్స్ కోటా: హైకోర్టులో తెలంగాణ సర్కారుకు చుక్కెదురు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-7 వల్ల స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని నీలారాయ్, కాలేశ్రేయ అనే ఇద్దరు స్ట్పోర్ట్స్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రొఫెషనల్ కోర్సు(మెడికల్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్..)లలో స్పోర్ట్స్ కోటాను ఎత్తివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టును కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-7లో స్పోర్ట్స్ కోటాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. న్యాయవాది వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది.
జూన్ నెలలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-7పై కోర్టు స్టే ఇచ్చింది. ఏడాదిపాటు ప్రొఫెషనల్ కోర్సులలో స్పోర్ట్స్ కోటాను పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications