కేసీఆర్‌ని చూసి చేయండి, కాపీ కొట్టొద్దు: బాబుకు సుమన్ కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పరిశ్రమల శాఖ వెబ్ సైట్‌ను కాపీ చేసిన ఘటనలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాము కాపీ కొట్టలేదని ఏపీ చెబుతుండగా, కాపీ కొట్టారని తెలంగాణ చెబుతోంది. తాజాగా, తెరాస ఎంపీ బాల్క సుమన్ ఈ ఘటన పైన స్పందించారు.

Also Read: 'ఆ సీక్రెట్ మీకెలా తెలిసింది, హ్యాక్ చేశారా, నవ్వులపాలైన కేటీఆర్'

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్‌లైన్ అప్లికేష‌న్లు కాపీ కొట్టడం ఏమిటని ఆయన ప్ర‌శ్నించారు. ఈ చ‌ర్య దుర్మార్గ‌మ‌న్నారు. త‌మ ఆన్‌లైన్ అప్లికేష‌న్లను కాపీ కొట్ట‌క‌పోతే దానికి సంబంధించిన విచార‌ణ‌కు స‌హ‌క‌రించొద్ద‌ని ప్ర‌భుత్వ నేత‌లు అధికారుల‌ను ఎందుకు ఆదేశించార‌ని మండిపడ్డారు.

Also Read: అప్లికేషన్ కాపీ చేసిన బాబు ప్రభుత్వం: పోలీసులకు టి ఫిర్యాదు

Balka Suman counter to AP Government

ఈ అంశంపై ఏపీ ఇచ్చిన స‌మాచారాన్ని కేంద్రం ప‌రిశీలించాల‌ని సుమన్ డిమాండ్ చేశారు. ఏపీ ప్ర‌భుత్వ నేత‌లు ఈ అంశంపై విచార‌ణ‌కు సహకరిస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తమ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోన్న విధానాల‌ను ఏపీ ప్ర‌భుత్వం ఆద‌ర్శంగా తీసుకోవ‌చ్చు కానీ కాఫీ కొట్టే హ‌క్కు లేద‌న్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టును కొంద‌రు నేత‌లు రాద్ధాంతం చేస్తున్నార‌ని, అటువంటి చ‌ర్య‌లను ఆపేయాల‌న్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS MP Balka Suman counter to AP Government.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి