Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాళ్ళంతా దండుపాళ్యం ముఠా: బీఆర్ఎస్‌తో ఆ పార్టీల పొత్తుపై భగ్గుమన్న బండి సంజయ్!!

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసే పోటీ చేయడానికి సిద్ధమయ్యారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తో భేటీ అనంతరం బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ప్రజలను మోసం చెయ్యటం కోసం నటిస్తున్న పార్టీలు

ప్రజలను మోసం చెయ్యటం కోసం నటిస్తున్న పార్టీలు

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు బలపడుతున్న బిజెపి ఒంటరిగానే అధికారంలోకి వస్తుందన్న ఆందోళనతోనే వీరంతా కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యారని, కాకపోతే ప్రస్తుతానికి నటిస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం ఎన్నికల వరకు వీళ్లంతా కొట్లాడుకుంటున్నట్టు నటిస్తారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు దండుపాళ్యం ముఠా అని ఒకరు దేశాన్ని దోచుకుంటే, మరొకరు కొన్ని రాష్ట్రాలను దోచుకున్నారని, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుందని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్

కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయికి ఎప్పుడో దూరమైందని పేర్కొన్న బండి సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు బయట పెడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టి కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి ఉంటాయన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేశారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడే దమ్ము లేదని, ఒకవేళ కొట్లాడి గెలిపించిన ఆ పార్టీ నాయకులంతా మళ్లీ తిరిగి బిఆర్ఎస్ పార్టీ బాట పడతారని ప్రజలకు తెలుసు అన్నారు. గతంలోనూ ఇదే జరిగిందని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండూ ఒకటే.. ఎన్నికల వరకే వీరి కొట్లాటల డ్రామాలు

బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండూ ఒకటే.. ఎన్నికల వరకే వీరి కొట్లాటల డ్రామాలు

ప్రజలు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ను వేరుగా చూడడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తెలుసు అని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ పెద్దలు కూడా బిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేయాలని భావిస్తున్నారని ఈ అంశం పైన గతంలో ఢిల్లీలో చర్చలు కూడా జరిగాయి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడే కలిస్తే తెలంగాణలో బిజెపి మరింత బలపడే అవకాశం ఉంటుందని, కాబట్టి ఎన్నికల వరకు కొట్లాడినట్టు నటిద్దామని వారు భావిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

 కాంగ్రెస్ పాదయాత్రల ఉద్దేశం ఏమిటి?

కాంగ్రెస్ పాదయాత్రల ఉద్దేశం ఏమిటి?

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది ఒక బిజెపిని మాత్రమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవని చెబుతున్నప్పుడు ఆ పార్టీ పాదయాత్రలు ఎందుకు చేస్తుందో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పుడప్పుడు చేసే ఆందోళనలు ఎందుకు? ప్రజలను నమ్మించి మోసం చేయడం ఎందుకు? అంటూ బండి సంజయ్ నిలదీశారు.

 తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి


గతంలో కావాలని బిజెపి, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని తప్పుడు ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు అసలు విషయం బిజెపి, కాంగ్రెస్ రెండు ఒకటన్నది బయటకు వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో తాము 119 స్థానాలలో పోటీ చేశామని పేర్కొన్న బండి సంజయ్, ఇప్పుడు కూడా అన్ని స్థానాలలో పోటీ చేస్తామని, ఈసారి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. వయసు మీద పడుతుండటంతో కేసీఆర్ ఈమధ్య అన్ని మర్చిపోతున్నారని వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్, బిజెపి పెరుగుదలను చూసి డిప్రెషన్ లోకి వెళ్లారంటూ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+