బండి సంజయ్ కు అరుదైన గుర్తింపు - ప్రధాని కోరి మరీ : ఎవరికీ దక్కని ఛాన్స్..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు అరుదైన గుర్తింపు దక్కింది. బీజేపీలో ఏ రాష్ట్ర అధ్యక్షుడికి దక్కని గౌరవం లభించనుంది. ప్రధాని కోరి మరీ బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ పాదయాత్ర పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెప్పించుకున్నారు. బండి పాదయాత్ర స్పూర్తిగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసారం చేస్తున్నారు. ప్రతీ నిమిషం విలువైనదిగా భావించే ప్రధానితో సహా కేంద్ర మంత్రులు..ఎంపీలు పది నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను వీక్షించనున్నారు. ఇందులో టీఆర్ఎస్ బండిని అడ్డుకున్న తీరు.. ప్రజల్లో వచ్చిన ఆదరణ ప్రత్యేకంగా వీడియోలో ప్రదర్శించనున్నారు.

వీడియో - నివేదిక స్వయంగా కోరిన ప్రధాని

వీడియో - నివేదిక స్వయంగా కోరిన ప్రధాని

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర ముగిసింది. తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ప్రధాని.. తాజాగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల పైన పార్టీ నేతలతో ఆరా తీసారు. అందులో భాగంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మన్ నుంచి సమాచారం సేకరించారు. ఆ సందర్భంలోనూ బండి సంజయ్ పాదయాత్ర గురించి వాకబు చేసారు. మంచి స్పందన వస్తోందని.. ముగింపు సభకు నాడు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిన సంగతి లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో పర్యటనకు వచ్చిన ప్రతీ సందర్భంలోనూ బండి సంజయ్ ను ప్రధాని అభినందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ తో ప్రత్యేకంగా బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ సిద్దం చేయాలని..తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రదర్శన

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రదర్శన

పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం ద్వారా మిగిలిన నేతలకు స్పూర్తిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇందు కోసం పది నిమిషాల నిడివితో హిందీలో దీనిని సిద్దం చేయాలని సూచించారు. ప్రధాని కోరటంతో తెలంగాణ బీజేపీ నేతలు ఈ వీడియోను సిద్దం చేసారు. రేపు మంగళవారి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ప్రధాని తో సహా పార్టీ నేతల సమక్షంలో ఆ వీడియో ప్రదర్శించనున్నారు. సంగ్రామ యాత్ర ఉద్దేశ్యం తో పాటుగా జరిగిన సభల హైలైట్స్ ను అందులో పొందు పర్చారు. అదే విధంగా పాదయాత్ర వేళ కార్యకర్తల ఉత్సాహాన్ని అందులో ప్రస్తావించారు. ఇక, అధికార టీఆర్ఎస్ బండి సంజయ్ పాదయాత్రకు అడ్డంకులు కల్పించినా ఏ విధంగా అధిగిమించిందీ ప్రత్యేకంగా పొందుపర్చారు.

బండి సంజయ్ కు అరుదైన గుర్తింపు వేళ

బండి సంజయ్ కు అరుదైన గుర్తింపు వేళ

ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు పలు యాత్రలు చేసారు. కానీ, ప్రధాని కోరి మరీ ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్ర పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయటం బండికి దక్కిన గౌరవంగా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధానితో పాటుగా ఇతర నేతలు ఈ వీడియో తిలకించటం ద్వారా బండికి పార్టీలో జాతీయ స్థాయి గుర్తింపు రానుంది. తెలంగాణ పైన బీజేపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసిన వేళ.. తాజా నిర్ణయాలకు సిద్దం అవుతోంది. అందులో భాగంగా, టీఆర్ఎస్ పైన వచ్చే ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా ఫిక్స్ చేసుకుంది. దీని కోసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం..ప్రజలతో మమేకం అయ్యేందుకు బండి సంజయ్ చేసిన ప్రయత్నాన్ని ఈ వీడియో ద్వారా పార్టీ పార్లమెంటరీ సమావేశంలో వివరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+