కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ పై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. దీంతో బిజెపిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కిషన్ రెడ్డి నాయకత్వాన్ని కొందరు సమర్థిస్తూ ఉంటే, మరికొందరు కిషన్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. అధిష్టానం ఎన్నికల సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకుందని బీజేపీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు.
బీజేపీలో తాజా రాజకీయ పరిణామాలతో ఆసక్తికర వర్గ పోరు మీడియా వేదికగా కొనసాగుతుంది. అయినా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్న బండి సంజయ్ వర్గం అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈటల వర్గం సోషల్ మీడియా వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం పైన సంతోషం వ్యక్తం చేస్తుంది.

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. బీజేపీలో బండి వర్గం చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించటం లేదు. ఇదిలా ఉంటే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులు అయిన కిషన్ రెడ్డికి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అభినందనలు తెలిపారు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషిచేస్తారని ఆశిస్తున్నానని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.

అయితే బీజేపీలో తాజా పరిణామాలు పార్టీలో ఒక అనిశ్చితికి కారణంగా మారాయి. బండి సంజయ్ కు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని, కీలక పదవి ఇస్తారని భావిస్తున్న తరుణంలో మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో.. తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications