• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో ఆపదలో ఆదుకునే మొనగాడు కావాలా.. కేసీఆర్ మోచేతినీళ్లు తాగేటోడు కావాలా?: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు లో జరుగుతోంది ధర్మ యుద్ధమే అని పేర్కొన్న బండి సంజయ్ ఆపదలో ఆదుకునే మొనగాడు కావాలో.. కెసిఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు కావాలో తేల్చుకోవాలని పేర్కొన్నారు.

తినడానికి తిండి లేని కెసిఆర్ ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారు? బండి సంజయ్

తినడానికి తిండి లేని కెసిఆర్ ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారు? బండి సంజయ్

టిఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఇక కమ్యూనిస్టు ఎర్రగులాబీలు అని బండి సంజయ్ సెటైర్లు వేశారు. సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమవద్ద సమాచారం ఉందన్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేని కెసిఆర్ ఇప్పుడు వేలకోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. 100 కోట్లతో కేసీఆర్ విమానం ఎట్లా కొంటున్నారని ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నారని నిలదీశారు. కెసిఆర్ కొడుకు పిరికిపంద అంటూ బండి సంజయ్ కేటీఆర్ ను ఎద్దేవా చేశారు.

తన సవాల్ కు కేసీఆర్ భయపడి పారిపోయారు

తన సవాల్ కు కేసీఆర్ భయపడి పారిపోయారు

ఇక మునుగోడు ఉప ఎన్నికల వేళ గొర్రెల పథకం లో ప్రజలకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా ఫ్రీజ్ చేయించామని తనపై ఆరోపణలు చేసిన కేసీఆర్, తన సవాల్ కు భయపడి పారిపోయారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ మాట నిజమైతే భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేద్దామని పిలిచినా కేసీఆర్ రాలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక మునుగోడులో పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలకు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయాలని మనుగోడు ప్రజలను కోరారు.

మంత్రులు, ఎమ్మెల్యేల, పోలీసు వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బులు తరలిస్తున్నారు

మంత్రులు, ఎమ్మెల్యేల, పోలీసు వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బులు తరలిస్తున్నారు

గులాబీ మంత్రులు, నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేల, పోలీసు వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బులు తరలిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ కి నిధులు సమకూరుస్తున్న కంపెనీలను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులపై విచారణ జరిపి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. కెసిఆర్ మోసపూరిత పాలనకు సమాధి కట్టాలని పిలుపునిచ్చిన ఆయన, మునుగోడులో ఫలితాలు తారుమారు అయితే కెసిఆర్ అహంకారం మళ్లీ తలకెక్కి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే మునుగోడు ఓటర్లు బిజెపికి ఓట్లు వేసి కెసిఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు.

ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపుఖాయమని స్పష్టం

ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపుఖాయమని స్పష్టం


రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నాయని టీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తోందన్నారు బండి సంజయ్. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎక్కడా పోటీలో ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రచారానికి వెళితే మహిళలు తలుపులు మూసుకునే పరిస్థితి నెలకొందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని పేర్కొన్న బండి సంజయ్, కెసిఆర్ ఫాం హౌస్ నుండి గల్లీలో కి వచ్చారంటే అందుకు కారణం బిజెపి చేస్తున్న పోరాటాలని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ కేంద్రం ఎంతగానో నిధిలిస్తోంది. గ్రామాల్లో అంతో ఇంతో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

త్వరలోనే మీ బండారం బయటకు.. మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ కాపాడలేరు

త్వరలోనే మీ బండారం బయటకు.. మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ కాపాడలేరు

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చెల్లని రూపాయి. ఇక్కడే కెసిఆర్ పనైపోయింది. ఇక బీఆర్ఎస్ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునేదెవ్వరు? టీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ నేతలకే లేదు అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.టీఆర్ఎస్ పార్టీ డబ్బు, బంగారం, మందు, మాసం విచ్చలవిడిగా పంచుతోంది. పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదు? మంత్రుల, అధికార పార్టీ ఎమ్మెల్యేల వాహనాలను ఎందుకు తనిఖీ చేయరు? అని బండి సంజయ్ నిలదీశారు. అధికారంలో అడ్డగోలుగా మంత్రులు సంపాదించారని, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు బండి సంజయ్. ఎట్టి పరిస్థితుల్లో మంత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మంత్రుల, ఎమ్మెల్యేల చిట్టా రెడీగా ఉందన్నారు. కేసీఆర్ మిమ్ముల్ని కాపాడలేరు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో మీరు పొందుపర్చిన ఆస్తులెన్ని? ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తులెన్ని అనే వివరాలన్నీ బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు.

English summary
In Munugode by-election campaign, Bandi Sanjay targeted the TRS party and made harsh comments. Bandi Sanjay accused TRS of misusing power and moving money in the vehicles of ministers, MLAs and police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X