కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పోటీచేస్తే కచ్చితంగా విజయం సాధించాలి. ఓటమి ఎదురు కాకూడదు.

|
Google Oneindia TeluguNews

భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయం కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. మరోసారి ఆయన నియోజకవర్గం ఏదంటూ హాట్‌టాపిక్‌గా మారింది. పలు నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని బండికి వినతులు వస్తున్నప్పటికీ ఆయన ఎవరికీ సమాధానం ఇవ్వలేదు. వేములవాడ నుంచి పోటీచేయడం ఖాయమైందంటూ గతంలో బలంగా ప్రచారం జరిగింది. తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది.

అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న బండి సంజయ్

అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న బండి సంజయ్

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రశ్నిస్తూనే కరీంనగర్ నియోజకవర్గ ప్రాంతంలోని సమస్యలను కూడా లేవనెత్తుతున్నారనే విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి.

మంత్రి గంగుల కమలాకర్ పై ఓటమి

మంత్రి గంగుల కమలాకర్ పై ఓటమి

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పోటీచేస్తే కచ్చితంగా విజయం సాధించాలి. ఓటమి ఎదురు కాకూడదు. అందుకే పలు సంస్థలతో ఆయన తాను ఎక్కడినుంచి పోటీచేస్తే విజయం సాధించగలమనే విషయమై సర్వే చేయించారు. అందరూ దాదాపుగా కరీనంగర్ సురక్షితమని చెప్పడంతో అక్కడే ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గుంగల కమలాకర్ పై కరీంనగర్ నుంచే పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే ఎంపీగా విజయం సాధించారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యం

రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యం

తెలంగాణకు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యాన్ని బీజేపీ ఏర్పరుచుకుంది. మంత్రి గంగుల కమలాకర్ ను ఓడించాలంటే బండి సంజయ్ సరైన అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందులోను కరీంనగర్ ఎంపీగా ఉండటంవల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించడం సులువవుతుందని అంచనా వేస్తున్నారు.

గత ఎన్నికల్లో బండి సంజయ్ కు 66,009 ఓట్లు వచ్చాయి. గంగుల కమలాకర్ కు 80,983 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన పొన్నం ప్రభాకర్ 39,500 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో బండి ఓడిపోవడంతో ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం సాధించడానికి మార్గం ఏర్పడుతుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

English summary
The question of which constituency Bharatiya Janata Party Telangana President Bandi Sanjay will contest from in the next assembly elections has been buzzing in the political circles for years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X