మహాశివరాత్రి రోజు బ్యాంకులకు సెలవు ఉందా..?.. లేదా..?
మహాశివరాత్రి పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. అయితే ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున ఉత్తర్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జమ్ము కశ్మీర్, మిజోరాం, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉండనుంది. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులకు బంద్ ఉండనుంది.
అయితే బ్యాంకులు బంద్ ఉన్నా నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ సైట్లు, యూపీఐ యాప్స్, ఏటీఎం సర్వీసెస్ మాత్రం అలాగే కొనసాగనున్నాయి. ఫిబ్రవరి నెలలో భారీగానే బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

ముఖ్యంగా ఫిబ్రవరి 3వ తేదీ సరస్వతి పూజ, మునిసిపల్ కార్పొరేషన్ జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీ, సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీ, ఫిబ్రవరి 15 లూయి నాగి -ని బ్యాంకులు బంద్, ఇక చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19వ తేదీ, ఫిబ్రవరి 20 స్టేట్ డే, ఫిబ్రవరి 21 జనరల్ ఎలక్షన్స్, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి, ఫిబ్రవరి 28 లోజర్ సందర్భంగా భారీగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు సెలవు ఉండదు. ఆయా రాష్ట్రాల, ప్రాంతాల పండుగలు, ఇతర కార్యక్రమాల కారణంగా బ్యాంకులకు సెలవు ప్రకటిస్తుంది ఆర్బీఐ.












Click it and Unblock the Notifications