హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఒబామా చాపర్‌కు తెలంగాణ నుంచే విడిభాగాలు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెను మార్పులు జరగనున్నాయని, రక్షణ, వైమానిక రంగాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోసం తయారు చేసిన చాఫర్ విడిభాగాలను ఇక్కడే తయారు చేసి పంపించామని తెలిపారు. నాగార్జున సాగర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధుల శిక్షణలో భాగంగా సోమవారం ఆయన పారిశ్రామిక రంగంపై మాట్లాడారు.

Barack Obama's chopper to have cabin made in India says KTR

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చామని చెప్పారు. భారీ పరిశ్రమలకు పదిహేను రోజుల్లో, చిన్న పరిశ్రమలకు నెల రోజుల్లో అనుమతులిస్తున్నామని తెలిపారు. అనుమతులు పారిశ్రామికవేత్తల హక్కుగా చట్టం తెచ్చామని అన్నారు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల అభివృద్ధికి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు గాను మౌలిక సదుపాయాల సంస్థకు ఇప్పటికే 2.50 లక్షల ఎకరాలను కేటాయించామన్నారు.

Barack Obama's chopper to have cabin made in India says KTR

వైమానిక రంగంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వంతో సమన్వయం కుదుర్చుకొని, రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమలకు సరళీకృత అనుమతులు సాధిస్తామని కేటీఆర్‌ అన్నారు. దళిత, గిరిజనులను, మహిళలను ప్రోత్సహిస్తామని, వారికి రుణసాయం అందించడంపై త్వరలోనే బ్యాంకు అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Barack Obama's chopper to have cabin made in India says KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X