వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవన ప్రతీక: బతుకమ్మ వేడుకల్లో కవిత, పాల్గొన్న జానా, ఈటెల(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. బతుకమ్మ సంబరాలలో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కవిత పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల జీవనానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె అన్నారు.

బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న కవితకు కొండమల్లేపల్లి వద్ద టిఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొదట దేవరకొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కవిత అక్కడ పోలీస్ సిబ్బంది భార్యలతో కలిసి బతుకమ్మను పేర్చారు.

కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ పండుగలను తీవ్రంగా అణచివేశారని ఆరోపించారు. తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత బతుకమ్మ పండుగకు తెలంగాణలోనే కాక ప్రపంచంలోని పలు దేశాలలో ఉన్న తెలంగాణ ఆడపడుచులు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు.

బతుకమ్మ పాటలలో ఆడపడుచుల సుఖసంతోషాలు, కష్టసుఖాలు ప్రతిబింబిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ముందుండి పోరాడారని ఆమె కొనియాడారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్నారు.

పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను పేర్చి పాటలు పాడుకోవడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు. బతుకమ్మను పేర్చిన అనంతరం డిఎస్పీ చంద్రమోహన్ సతీమణి సిసిఎస్ డిఎస్పీ సునితతోపాటు పలువురు మహిళలు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి తమలపాకులు, అరటిపండ్లతో వాయినం ఇచ్చారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలంగాణ ప్రజల జీవనానికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబరాలలో భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న కవితకు కొండమల్లేపల్లి వద్ద టిఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

మొదట దేవరకొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కవిత అక్కడ పోలీస్ సిబ్బంది భార్యలతో కలిసి బతుకమ్మను పేర్చారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ పండుగలను తీవ్రంగా అణచివేశారని ఆరోపించారు.

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత బతుకమ్మ పండుగకు తెలంగాణలోనే కాక ప్రపంచంలోని పలు దేశాలలో ఉన్న తెలంగాణ ఆడపడుచులు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు.

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

బతుకమ్మ పాటలలో ఆడపడుచుల సుఖసంతోషాలు, కష్టసుఖాలు ప్రతిబింబిస్తాయని చెప్పారు.

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ముందుండి పోరాడారని ఆమె కొనియాడారు. తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్నారు.

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను పేర్చి పాటలు పాడుకోవడం చాలా సంతృప్తినిచ్చిందన్నారు.

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

గోషామహల్ పోలీస్‌స్టేషన్‌లో

బతుకమ్మను పేర్చిన అనంతరం డిఎస్పీ చంద్రమోహన్ సతీమణి సిసిఎస్ డిఎస్పీ సునితతోపాటు పలువురు మహిళలు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి తమలపాకులు, అరటిపండ్లతో
వాయినం ఇచ్చారు.

కూకట్‌పల్లిలో

కూకట్‌పల్లిలో

అనంతరం పోలీస్‌స్టేషన్ నుండి బయలుదేరిన కవిత నేరుగా హనుమాన్‌నగర్ కాలనీలో ఉన్న టిఆర్‌ఎస్ నాయకుడు చెరిపల్లి బాలరాజు నివాసగృహానికి చేరుకొని అక్కడ ఉన్న మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు.

కూకట్‌పల్లిలో

కూకట్‌పల్లిలో

ఆ సమయంలో బతుకమ్మ పాటలు పాడుతున్న కవితతో గొంతు కలిపిన మహిళలు చిన్నగా పాటలు పాడుతుండడంతో తెలంగాణ ఆడపడుచులు ఇలాగేనా పాడేది జోష్‌తో పాడితే బాగుంటుందనడంతో నవ్వులు వెల్లివిరిశాయి.

కూకట్‌పల్లిలో

కూకట్‌పల్లిలో

బతుకమ్మల ఆట పాటాలతో ప్రభుత్వ కార్యాలయాలు మారుమ్రోగాయి. నగరంలోని జలమండలి, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సోమవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో, సికింద్రాబాద్‌లోని ఆర్‌డిఓ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళ ఉద్యోగులు, అధికారులు ఉత్సహంగా పాల్గొన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా రవీంద్రభారతిలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల ముగింపు కార్యక్రమంలో సోమవారం సాయంత్రం ఘంటసాల ప్రాంగణంలో ఆటపాటల బతుకమ్మ నృత్య సంగీతాలు అలరించాయి.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డగా వర్ణించారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

ప్రపంచంలో ఎక్కడాలేని బతుకమ్మ సంప్రదాయం జానపద సంస్కృతిని తెలంగాణలో అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని అన్నారు.

బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ వేడుకలు

పాశ్చాత్య సంస్కృతి రాజ్యమేలుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ సంస్కృతిని అభివృద్ధి చేస్తూ బతుకమ్మను ప్రభుత్వ పండుగను జరుపుకుంటున్నామని చూసి ఓర్వలేనివారు ఈ పండుగను రాజకీయం చేస్తూ విమర్శిస్తున్నారని ఈటెల ఆరోపించారు.

అనంతరం పోలీస్‌స్టేషన్ నుండి బయలుదేరిన కవిత నేరుగా హనుమాన్‌నగర్ కాలనీలో ఉన్న టిఆర్‌ఎస్ నాయకుడు చెరిపల్లి బాలరాజు నివాసగృహానికి చేరుకొని అక్కడ ఉన్న మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు. ఆ సమయంలో బతుకమ్మ పాటలు పాడుతున్న కవితతో గొంతు కలిపిన మహిళలు చిన్నగా పాటలు పాడుతుండడంతో తెలంగాణ ఆడపడుచులు ఇలాగేనా పాడేది జోష్‌తో పాడితే బాగుంటుందనడంతో నవ్వులు వెల్లివిరిశాయి.

English summary
Bathukamma celebrations continues in Telangana districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X