Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండ గుహల్లో విహరించే అవకాశం.. హైదరాబాద్ కు ఎంత దూరం అంటే..?

లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన కొండ గుహల్లో విహరించాలని ఉందా..? అయితే మీరు ఈ ప్రదేశాన్ని కచ్చితంగా చూడాల్సిందే. ఈ కొండ గుహల్లోని వింత లోకం మిమ్మల్ని మైమరిపించేలా చేస్తుంది. ఇక్కడి కొండ గుహల రహస్యాలు పర్యటకుల్ని చూపుతిప్పుకోనివ్వదు. ఆద్యంతం సాహసోపేతంగా.. ఎంతో ఉత్సాహంగా సాగే ఈ ప్రయాణం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇలాంటి అరుదైన గుహలు దేశంలో మరెక్కడా లేవు. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ కు దగ్గర్లోనే ఉండటంతో నిత్యం వేలాదిమంది పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. పెద్దవారితోపాటు చిన్నపిల్లలు, మహిళలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు అధికారులు.. ఈ కొండల్లోని కలర్ ఫుల్ లైటింగ్ మరింత గొప్ప అనుభూతిని పంచుతుంది.

Belum Caves Ancient Wonder of Thousands of Years Draws Global Tourists

ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఉన్న ఈ బెలూం గుహలకు లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ అరుదైన గుహలను మొదటిసారిగా ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ ఫూటే.. 1884 లో తన పుస్తకాల్లో రచించారు. 1982-84 మధ్యలో హెచ్ డీ గేబర్ అనే గుహల పరిశోధకుడు తన టీమ్ తో కలిసి 3.225 కి. మీ. పరిశోధించి పటం గీశాడు. 1989 లో ఏపీ ఆర్కియాలాజికల్ డిపార్ట్ మెంట్ ఆధీనంలోకి తీసుకుంది. 2000లో ఏపీటీడీసీ తీసుకుని అభివృద్ధి చేసింది. 2003 నుంచి పర్యటకులకు అనుమతినిచ్చింది. అప్పటినుంచి నిత్యం దేశవ్యాప్తంగా వేలమంది సందర్శకులు ఈ బెలూం గుహలను సందర్శిస్తున్నారు.

Belum Caves Ancient Wonder of Thousands of Years Draws Global Tourists

ఈ గుహల్లోకి వెళితే ఓ వింత ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ఏదో తెలియని కొత్త ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతికి పర్యటకులు లోనవుతారు. ఈ గుహలకు జాతీయ గుర్తింపు లభించడంతో నిత్యం వేలాది మంది పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ బెలూం గుహలకు తెలుగు రాష్ట్రాలు, దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. ఈ గుహలను ముందు తరాలకోసం సంరక్షించేందుకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ గుహలు ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో పొడవైన, దేశంలోనే మొదటి అంతర్భాగ గుహలుగా ప్రఖ్యాతి పొందాయి.

Belum Caves Ancient Wonder of Thousands of Years Draws Global Tourists
Belum Caves Ancient Wonder of Thousands of Years Draws Global Tourists

ఈ గుహల్లో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఈ గుహలలో క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల కాలం నాటి మట్టిపాత్రలో మనిషి అస్థికలు ఉన్నాయి. అలాగే ఇక్కడే రాతి కత్తి కూడా లభ్యం అయింది. దీంతో వీటిని ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ గుహల్లో రాతిలో మలిచిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ బెలూం గుహలను చూసేందుకు నిత్యం హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి ఈ గుహలు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+