వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ ఒక్కడిదే కాదు.!బీజేపి కవ్వింపు రాజకీయాలు మానుకోవాలన్న భట్టి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బీజేపి,కాంగ్రెస్ పార్టీల మద్య మతాల మతాబులు పేలుతున్నాయి. మత కట్టడాల కింద శివలింగాల ప్రస్తావన పైన పంచాయితీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఛార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయంపైన కమలం, కాంగ్రెస్ నాయకులు మాటల తూటాలు పేన్చుకుంటున్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా బండి సంజయ్ ఒక్కడిదా?అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మతాలను రెచ్చగొట్టి తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారని భట్టి మండిపడ్డారు.

 ఆలయంపై బీజేపి వివాదాస్పద వ్యాఖ్యలు.. బండి సంజయ్ పై భట్టి విక్రమార్క ఫైర్..

ఆలయంపై బీజేపి వివాదాస్పద వ్యాఖ్యలు.. బండి సంజయ్ పై భట్టి విక్రమార్క ఫైర్..


భాగ్యలక్ష్మి అమ్మవారిని తాము కూడా ఆరాధిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్‌లో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని చెప్పారు. ఎవరో చేసిన పనికి పార్టీది బాధ్యత ఎలా అవుతుంది అని ప్రశ్నించారు.హిందూత్వం బండి సంజయ్ సొత్తు కాదని, మతాలు, నమ్మకాలు వ్యక్తిగతమన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని లాగి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మెంటల్ గా మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు. భారత కాంగ్రెస్ భావజాలాన్ని వ్యతిరేకించడం అంటే, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని భట్టి ఆగ్రహం వ్యక్తం చేసారు.

 భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎప్పుడూ ఆరాధిస్తాం.. కాదనేందుకు బీజేపికి హక్కులేదన్న భట్టి

భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎప్పుడూ ఆరాధిస్తాం.. కాదనేందుకు బీజేపికి హక్కులేదన్న భట్టి


భారత రాజ్యాంగాన్ని గౌరవించని వారు ప్రజా ప్రతినిధిగా కొనసాగడానికి అనర్హులని బండి సంజయ్ ని ఉద్దేశించి భట్టి విక్రమార్క ఘాటుగా వ్యాఖ్యానించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొంది అధికారంలోకి రావాలన్న బిజెపి చేస్తున్న దురాలోచనలో భాగంగానే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుందని భట్టి అన్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ మధ్యయుగ కాలం నాటి పరిస్థితులను సృష్టిస్తున్న బండి సంజయ్ కి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

 కాంగ్రెస్ భావజాలాన్ని వ్యతిరేకించడమంటే.. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లేనన్న సీఎల్పీ నేత

కాంగ్రెస్ భావజాలాన్ని వ్యతిరేకించడమంటే.. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లేనన్న సీఎల్పీ నేత


కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు చేసిన పాపాల్లో టీఆర్ఎస్ భాగస్వామ్యం కూడా ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో కలిపినప్పుడు, అఖిల పక్షాన్నీ ఎందుకు ఢిల్లీకి తీసుకు వెళ్లలేదని సీఎం చంద్రశేఖర్ రావును భట్టి సూటిగా ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల తర్వాత మొసలి కన్నీరు కార్చడం సరైంది కాదని చంద్రశేఖర్ రావుకు హితవు పలికారు భట్టి. అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

 ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు. కేసీఆర్ పై మండిపడ్డ భట్టి..

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు. కేసీఆర్ పై మండిపడ్డ భట్టి..

రాష్ట్ర ఏర్పాటులో ఎన్ని అవరోధాలు వచ్చినా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు భట్టి. తెలంగాణ వస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని, సామజిక తెలంగాణ ఏర్పడుతదని అందరు ఆశించారన్నారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా, తెలంగాణ ప్రజల ఆశయాలు ఏ మాత్రం సాకారం కాలేదని, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర సాధన లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు భట్టి విక్రమార్క.

English summary
CLP leader Bhatti Vikramarka fired on Bjp Chief Bandi sanjay.Bhatti was angry that BJP leaders were looking to provoke religions and politicize Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X