బీజేపీకి బిగ్ షాక్: ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఏ1 గా బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో వరంగల్ పోలీసులు నిన్న వాట్సాప్ గ్రూప్ లో హిందీ పేపర్ చక్కర్లు కొట్టడానికి కారణమైన నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఒక మైనర్ బాలుడుతో పాటు, శివ గణేష్ అనే వ్యక్తిని, ప్రశాంత్ అనే మాజీ విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన ప్రశాంత్, బండి సంజయ్ కు వాట్సప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని పంపించారని, ఫోన్ చేసి మాట్లాడారని పోలీసులు గుర్తించారు. బండి సంజయ్ కు ప్రశాంత్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ లో అనేక కీలక విషయాలను గుర్తించిన పోలీసులు బండి సంజయ్ పైన కూడా కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు.

ఇక తాజాగా హిందీ ప్రశ్న పత్రం లీక్ కేస్ కు సంబంధించిన ఎఫ్ఐఆర్లో బండి సంజయ్ ని ఏ1 గా చేర్చారు వరంగల్ పోలీసులు. బండి సంజయ్ కమలాపూర్ పోలీసులు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1997 లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను వెల్లడించారు.
మొత్తం ఈ కేసులో పదిమంది నిందితులను పేర్కొన్న పోలీసులు ఏ1 నిందితుడిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరును పేర్కొన్నారు. ఏ2 గా ప్రశాంత్, ఏ3గా మహేష్, ఏ4 గా మైనర్ బాలుడు, ఏ5 గా శివ గణేష్, ఏ6గా సురేష్, ఏ7 గా శశాంక్, ఏ8 గా శ్రీకాంత్, ఏ9 గా శార్మిక్, ఏ10 గా వసంత్ పేర్లను చేర్చారు. అంతే కాదు బండి సంజయ్ పై ఐపిసి 120 బి, సెక్షన్ 420 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కా ఆధారాలతోనే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రూపొందించినట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications