తెలంగాణ ఇంటర్, టెన్త్ ఫలితాల విడుదల వేళ బిగ్ అప్డేట్..!!

ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాల వెల్లడికి సర్వం సిద్దం అవుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాల తేదీలను ప్రకటించింది. ఈ సారి ఇంటర్ ఫలితాలను విద్యార్ధులు త్వరగా తెలుసుకునేందుకు కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. అటు పదో తరగతి మూల్యాంకనం తో పాటుగా తుది ప్రక్రియ పూర్తయింది. గ్రేడింగ్ విధానం పైన ఈ రోజున ప్రభుత్వం నుంచి అధికారు లకు తుది నిర్ణయం వెల్లడి కానుంది. దీంతో, పదో తరగతి ఫలితాల ప్రకటన పైన దాదాపు నిర్ణయా నికి వచ్చారు. ఇదే సమయంలో ఫలితాల వెల్లడికి తుది ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణలో ఇంటర్ ఫలితాలను రేపు (మంగళవారం) ప్రకటించనున్నారు. ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2024-25 ఫలితాల వెల్లడికి ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలోని విద్యా భవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు. పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555 ఫోన్‌నంబర్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

big-update-on-inter-and-tenth-results-in-telangana

ఫలితాల కోసం
విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లేదా results. cgg.gov.in లో చూసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి.రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థు లు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకు పైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్‌ 10వ తేదీతో ముగిసింది. ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు సైతం అవకాశం ఇవ్వనున్నారు.

పది ఫలితాలు
ఇంటర్ విద్యార్ధులకు రీ కౌంటింగ్ తో పాటుగా సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను అధికారులు మంగళవారం ఫలితాలు విడుదల అనంతరం వెల్లడిస్తారు. ఇక.. పదో తరగతి ఫలితాల వెల్లడికి తుది కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం గ్రేడింగ్ విధానం పైన ఈ రోజు స్పష్టత ఇవ్వనుందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తే ఈ వారంలోనే దాదాపుగా ఈ నెల 26వ తేదీన పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలను ప్రకటించగా. .పదో తరగతి ఫలితాలు 23న వెల్లడించనున్నారు. పదో తరగతి ఫలితాల ను సైతం ఈ వారంలోనే వెల్లడించి.. కొత్త విద్యా సంవత్సరం పైన ఫోకస్ చేయాలని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+