తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు?
ఏపీలో మీట నొక్కితే.. తెలంగాణలో ఓటు పడాలి. ఇదీ భారతీయ జనతాపార్టీ వ్యూహం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఆ వ్యూహంలో భాగమే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం. ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన కూడా వెళ్లిపోయే ప్రమాదముండటంతో బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలియవస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంవల్ల తెలంగాణలో భారీగా లాభముంటుందనే అంచనాలో బీజేపీ వ్యూహకర్తలున్నట్లు సమాచారం.

ఏపీలో పొత్తుంటే తెలంగాణలో ఓట్లు పడతాయి
ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంవల్ల హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు, సెటిలర్లు అందరూ బీజేపీకి ఓటు వేస్తారని, దీనివల్ల మూడు నుంచి ఐదుశాతం ఓటింగ్ పెరుగుతుందనే అంచనాకు వచ్చారు. ఇటీవల అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కూడా బండి సంజయ్‌తోపాటు ఇతర నేతలతో దీనిపైనే చర్చ జరిగిందని సమాచారం. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఓటు కీలకమే అనే భావనలో బీజేపీ నేతలున్నారు.

పవన్‌కల్యాణ్ అభిమానుల ఓట్లన్నీ దక్కించుకోవాలి
అలాగే పవన్ కల్యాణ్‌ను దూరం చేసుకోకుండా ఉండటంవల్ల ఆయన అభిమానుల ఓట్లన్నీ గుంపగుత్తగా దక్కించుకోవాలని యోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే పవన్ కూడా దూరమయ్యే పరిస్థితి ఉండటంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అప్రమత్తమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో జేపీ నడ్డాతోపాటు ఆర్ఎస్ఎస్ కు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత వీరు అమిత్ షాతో సమావేశమయ్యారు. తెలంగాణలో విజయం సాధించాలంటే ఏపీలో పొత్తుల లంకె ఉందని తెలియజేశారు.

3టీడీపీతో పొత్తు విషయమై జేపీ నడ్డా సంకేతాలు?
ఆర్ఎస్ స్ నేతలు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు వెళ్లాలని గట్టిగా చెబుతున్నారు. అయితే ఏపీలో నలుగురైదుగురు బీజేపీ నేతలు తమ మిత్రపక్షం జనసేన అని చెబుతున్నారు. టీడీపీతో పొత్తుకు విముఖత ప్రదర్శిస్తున్న ఈ నలుగురైదుగురు నేతలను అధిష్టానం లైట్ తీసుకుందని తెలియవచ్చింది. గోదావరి గర్జన సభలో పాల్గొంటున్న జేపీ నడ్డా తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై రాష్ట్ర నేతలుకు సంకేతాలిస్తారిన తెలియవస్తోంది.












Click it and Unblock the Notifications