తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!!

తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త పొత్తులు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమీకరణాలను మార్చేస్తున్నాయి. దీంతో, రానున్న గ్రేటర్ తో సహా అన్ని ఎన్నికల్లో కొత్త పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ తరహాలో ఎన్డీఏ పొత్తు ఉంటుందని కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ పొత్తుల చర్చ వేళ బీజేపీ చీఫ్ తమ విధానం స్పష్టం చేసారు. పొత్తుల లెక్కల పై క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. రాబోయే జీహెంఎంసీ ఎన్నికల్లో 3 మేయర్‌ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ఆ వైఫల్యాలను సమీక్షించుకుని లోపాలను సవరించుకున్నామని వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధభయంతో భయపడు తుంటే..దేశ ప్రజలు మాత్రం మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారని రాంచందర్‌ రావు అన్నారు. లాక్‌డౌన్‌ విధించే అవకాశమే లేదని తెలిపారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాహుల్‌ గాంధీకి రూ.1000 కోట్లు ఇస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. సీఎం మొదటగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి, పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు.

bjp-chief-clarifies-over-alliance-for-up-coming-elections-in-the-state-amid-speculations-in-politica

తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు

అదే విధంగా హైడ్రా పేరుతో ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని, అధికారం లో కి వచ్చాక కూల్చివేతలే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి, డొక్కు బస్సులను నడపడం వల్ల ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూ లింద ని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో గ్యాస్‌ కొరత సృష్టించడం వెనక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని రాంచందర్‌రావు ఆరోపించారు. ఖానాపూర్‌ మున్సిపాలిటీ లో బీజేపీ సాధించిన విజయం ప్రత్యేకమైనదని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కమలం వికసించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ఎత్తుగడలను చిత్తుచేస్తూ ఖానాపూర్‌ మున్సిపాలిటీపై కాషాయజెండా ఎగురవేయడం చరిత్రాత్మక విజయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభివర్ణించారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+