అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన బీజేపీ..! నేషనల్ ఐకాన్ ను టార్గెట్ చేస్తారా ?
పుష్ప2 చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఇవాళ కొందరు అగంతకులు దాడి చేశారు. జుబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంట్లోకి దూసుకెళ్లి కాసేపు రభస సృష్టించారు. ఓయూ జేఏసీ నాయకులమని చెప్పుకుంటున్న కొందరు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగులగొట్టి, లోపలికి రాళ్లు, టమోటాలు విసిరారు. దీన్ని బీజేపీ ఖండించింది.
అల్లు అర్జున్ ఇంటిపై ఇవాళ జరిగిన దాడిని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేసారు. ఇందులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేసారు. #తెలంగాణలో దారుణ దృశ్యాలు! అంటూ ఆయన ట్వీట్ చేశారు. అందులో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారు #అల్లుఅర్జున్‌ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.

Outrageous scenes in #Telangana!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 22, 2024
The Congress-led state govt has stooped to targeting #AlluArjun, South India's highest taxpayer. Stone-pelting and harassment against a national icon—this is how they treat achievers?
Shameful and unacceptable! pic.twitter.com/04SpK4FtXA
నేషనల్ ఐకాన్ అయిన అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వడం, వేధించడం, జాతీయ అవార్డు అందుకున్న వారితో ఇలా వ్యవహరిస్తారా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది అవమానకరం మరియు ఆమోదయోగ్యం కాదని విష్ణు తన ట్వీట్ ముగించారు. దీనికి అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై ఓ టీవీ ఛానల్ వీడియోను కూడా జత చేశారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు అల్లు అర్జున్ కు మద్దతుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు.












Click it and Unblock the Notifications