బీజేపీకి నవంబర్ సెంటిమెంట్ - మునుగోడులోనే గెలుపు ఖాయమంటూ..!!
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మునుగోడు చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావటంతో, ఇక ప్రచారం పైన పార్టీలు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. మునుగోడులో ఇప్పుడు పొలిటికల్ సెంటిమెంట్ తెర మీదకు వస్తోంది. నామినేషన్ల దాఖలకు ముహూర్తం చూస్తున్న పార్టీల అభ్యర్ధులు..ప్రస్తుత సమయం ఏ విధంగా కలిసి వస్తుందోనని ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నేతల్లో కొత్త ధీమా కనిపిస్తోంది. మునుగోడు బై పోల్ కోసం బీజేపీ ప్రత్యేకంగా ఒక టీం ను ఏర్పాటు చేసుకుంది. ఈ టీం మునుగోడులోనే మకాం వేసి ఇంటింటి ప్రచారం కొనసాగిస్తోంది.

కోమటిరెడ్డి పైనే ప్రధాన బాధ్యత
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్దిగా బరిలో ఉన్నారు. కానీ, కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్ అనే బలమైన బంధం ఇప్పుడు మునుగోడులో బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. కోమటిరెడ్డికి అక్కడ అనుచర గణం ఎక్కువగా ఉన్నప్పటికీ వారితో బీజేపీకి ఓట్లు వేయించుకోవటం సవాల్ గా మారుతోంది. బీజేపీ నేతలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే కొత్త వాదన మొదలు పెట్టారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది.

ఉప ఎన్నికలు - నవంబర్ కు లింకు
నవంబర్ తమకు కలిసి వచ్చే మాసమని..అన్ని విజయాలకు ఈ నెలకు లింకు ఉందని చెబుతున్నారు. నవంబర్ నెలలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనైనా బీజేపీదే విజయమని ఘంటాపథంగా చెబుతున్నారు. నవంబర్ 3 .. 2020 న దుబ్బాక ఉప ఎన్నిక జరిగిందని...ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదే విధంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చిందని బీజీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. నవంబర్ 2 న హుజూర్ బాద్ ఎన్నిక పలితం వచ్చిందని..ఈటల రాజేందర్ అనూహ్య విజయం సాధించారంటూ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

సెంటిమెంట్ కలిసివచ్చేనా
ఇప్పుడు తిరిగి నవంబర్ నెలలోనే మునుగోడు ఉప ఎన్నిక జరగనుండటంతో.. ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనంటూ ధీమాగా చెబుున్నారు. బీజేపీ జాతీయ నేత సునీల్ బన్సాల్ మునుగోడు బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయిన సమయంలో ఉప ఎన్నిక వ్యూహం పైన చర్చించారు. ఉప ఎన్నికలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. దీంతో..నవంబర్ సెంటిమెంట్ ను నమ్ముకున్న బీజేపీ నేతలకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.
బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక వేళ నవంబర్ సెంటిమెంట్ ను నమ్ముకుంటోంది. నవంబర్ లో జరిగే ప్రతీ ఎన్నికలోనూ విజయం సాధించామని గుర్తు చేస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications