తెలంగాణ బీజీపీ చీఫ్ ఖరారు - లాస్ట్ మినిట్ ట్విస్ట్, మోదీ ఛాయిస్..!?
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఖరారయ్యారు. అనేక తర్జన భర్జనల తరువాత పార్టీ నాయకత్వం కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసింది. పార్టీ ఎన్నికల పరిశీలకులు ఈ మేరకు ఎంపిక బాధ్యత పూర్తి చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో.. ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు కొత్త అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు మంత్రాంగం సాగుతోంది. అయితే, తెలంగాణ పై ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. వచ్చే ఎన్నికలు టార్గెట్ గా ఈ ఎంపిక జరిగింది.
బీజేపీ కొత్త చీఫ్ గా
తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ పైన అధికారికంగా ఈ రోజు స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నిక ల ప్రక్రియలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. కాగా, అధ్యక్ష ఎన్నికకు సంబంధించి బీజేపీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ఆదివారం పార్టీ సీనియర్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కాగా, తుది జాబితాలో ఇద్దరి పేర్ల పైన ఢిల్లీ నేతలు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరి మధ్య
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు.. ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు తుది రేసులో నిలిచాయి. కాగా, హైకమాండ్ తమ నిర్ణయం అమలు దిశగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగంచింది. బీజేపీ జాతీయ నేతలు.. సంఘ్ ముఖ్యులు సూచన మేరకు రాంచందర్ వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మరోవైపు, పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతోంది. అయితే, తెలంగాణలో బీజేపీ బీసీ నినాదం తో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ముందుకు వెళ్తోంది. అయితే.. రాం చందర్ రావు తనకు బాధ్యతల విషయంలో ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.
నేడు నామినేషన్
పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరిస్తాని రాం చందర్ రావు పేర్కొన్నారు. ఇక, బీజేపీ గత ఎన్నికల సమయంలోనే తాము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మరో సామాజిక వర్గం నేత ఉండాలన్న అభిప్రాయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో, రాంచందర్‌రావు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుది జాబితాలో ఈటల, రాంచందర్‌రావు పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. చివరి నిమిషం లో ఏవైనా సమీకరణాలు మారితే తప్ప రాంచందర్‌రా లేదా ఈటలలో ఒకరికి అధ్యక్ష పీఠం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా.. తుది జాబితాలో వారి పేర్లు లేదని తెలుస్తోంది. దీంతో, చివరగా ప్రధాని మోదీ - అమిత్ షా నిర్ణయం మేరకే తెలంగాణ కొత్త చీఫ్ గా ఒక్కరే నామినేషన్.. ఏక్రగీవ ఎన్నిక జరిగేలా మంత్రాంగం కొనసాగుతోంది.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications