హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖర్: రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కోమటిరెడ్డి అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం గాంధీభవన్‌కు వచ్చిన ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎర్ర శేఖర్ తోపాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎర్ర శేఖర్.. 1996, 1999 ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ అభ్యర్థిగానే జడ్చర్ల నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీడీపీ ప్రాభవం కోల్పోవడంతో చాలా కాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఎర్ర శేఖర్.. చివరకు బీజేపీలో చేరారు. తాజాగా, బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

ఎర్ర శేఖర్ చేరికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి

మరోవైపు, ఎర్ర శేఖర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పార్టీ అధిష్టానంకు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, సీఎం ఎవరైనా అంటూ రేవంత్

ఇది ఇలావుండగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్‌ లేదా జులైలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి సోనియా ఎవరిని నిర్ణయిస్తే వారినే పల్లకిలో భూజాలపై ఎత్తుకొని సీఎం పీఠంపై కూర్చోబెడతానని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా కాంగ్రెస్‌ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

అప్పుడు వైఎస్..: కార్యకర్తలు అండగా నిలిచారంటూ రేవంత్

అప్పుడు వైఎస్..: కార్యకర్తలు అండగా నిలిచారంటూ రేవంత్

ఎవరూ కూడా పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని కోరారు. తాను
హుజూరాబాద్‌లో పార్టీ ఓటమితో కుంగిపోయిన తనను.. పార్టీకి 45 లక్షల పార్టీ సభ్యత్వాలు చేయించడం ద్వారా కార్యకర్తలు అండగా నిలిచారని రేవంత్ అన్నారు. డిసెంబరు 9న సభ్యత్వ నమోదు ప్రారంభిస్తే.. 95 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేసి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం ఆక్రమించిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పరాజయాలు ఎదుర్కొన్నారని.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుబ్బిరామిరెడ్డిని సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానితులుగా నియామకమైన క్రమంలో గాంధీభవన్‌లో నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.

English summary
BJP leader Erra Shekhar joins Congress: Revanth reddy says they will farm govt in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X