Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ లోక్ సభ ఎన్నికల శంఖారావం తెలంగాణా నుండే.. రంగంలోకి అమిత్ షా!!

తెలంగాణ రాష్ట్రంపై గత ఎన్నికల ముందు నుండి బిజెపి బలంగా ఫోకస్ పెడుతుంది. బిజెపి అగ్రనేతల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా నాటుకుపోయినట్టు కూడా అర్థమవుతుంది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అత్యధిక స్థానాలు సంపాదించాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి బిజెపి పూరించబోతుంది.

జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలను హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్న క్రమంలో ఎన్నికల ప్రచారానికి సౌలభ్యం కోసం బిజెపి దేశంలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించింది. 143 క్లస్టర్లుగా పార్లమెంటు నియోజకవర్గాలను విభజించిన బిజెపి ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా చేసింది.

BJP Lok Sabha Election campaign from Telangana.. Amit Shah enters the field!!

ఇక దేశంలోనే మొదటి క్లస్టర్ మీటింగ్ పాలమూరు జిల్లాలో బిజెపి ఏర్పాటు చేయడం తెలంగాణ సెంటిమెంట్ బిజెపికి ఉంది అని అందరూ చర్చించుకునేలా చేస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు.

కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పిజీ కళాశాలలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే ఏర్పాట్లను పనులను పరిశీలించిన బండి సంజయ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లుండి తెలంగాణకు వస్తున్నారని, వరుసగా మూడు క్లస్టర్ మీటింగుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

BJP Lok Sabha Election campaign from Telangana.. Amit Shah enters the field!!

అలాగే ఎలక్షన్ మేనేజ్ మెంట్ మీటింగ్ లో పాల్గొంటారన్నారు. వీటితోపాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారు అని తెలిపారు. ఈనెల 28న ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొంటారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. దాదాపు 10వేల నుండి 20వేల మంది కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు అని తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తారు. ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణా నుండే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించటం తెలంగాణా సెంటిమెంట్ బీజేపీకి బలంగా ఉందని చెప్పేందుకు తార్కాణం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+