ఉగ్రవాదుల అడ్డాగా హైదరాబాద్: 'ఓవైసీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయండి'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఏమైనా సత్రమా.... ఎవరైనా రావొచ్చా అని ప్రశ్నించారు.

వీసా లేకుండా నగరంలో ఉంటున్న వాళ్ళను అరెస్ట్ చేసి వెనక్కి పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాదులో పెను విధ్వంసానికి పథకం రచించి పోలీసులకు చిక్కిన ఐదుగురు ఉగ్రవాదులకు న్యాయ సాయం చేస్తానని ప్రకటించిన మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఆయన విరుచుకుపడ్డారు.

ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఓవైసీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ఎంపీగా ఉంటూ ఉగ్రవాదులకు అనుకూలంగా ఎలా ప్రకటనలు చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీ తన ప్రకటనల ద్వారా ఉగ్రవాదులకు మద్దతు పలికారని ఆయన ఆరోపించారు.

BJP MLA Kishan Reddy Fires On Asaduddin Owaisi Over Supporting of Terrorists

మజ్లిస్ ఒత్తిళ్లకు టీఆరఎస్ ప్రభుత్వం తలొగ్గుతోందని ఆరోపించారు. ఎంఐఎం కబంధహస్తాల నుంచి పోలీసు వ్యవస్థ కాపాడాలని ఆయన పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసిస్ స్థానికులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదంలోకి దింపుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క రంజాన్ మాసంలోనే మొత్తం 800 మందిని హతమార్చినట్లు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. సిరియా కేంద్రంగా మార్గనిర్దేశం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఇబ్రహీంను చేరదీసిన షఫీ ఆర్మర్‌కు విదేశాల్లోని ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

ఉగ్రవాదులు ఇస్తాంబుల్, బాగ్దాద్, హైదరాబాద్ ఆ తర్వతా బంగ్లాదేశ్‌లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలు సృష్టించాలని నిర్ణయించారని సమాచారం. ఇందులో భాగంగా పశ్చిమబెంగాల్‌ నుంచి భారత్‌లోకి చొరబడ్డారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Kishan Reddy Fires On Asaduddin Owaisi Over Supporting of Terrorists.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి