బీఫ్ తినేవారు బిజెపికి ఓటు వేయక్కర్లేదు: అసదుద్దీన్‌కు రాజాసింగ్ కౌంటర్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆవు, ఎద్దు మాంసం తినేవారు బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు.
అసదుద్దీన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గోవధను బీజేపీ వంద శాతం అడ్డుకుంటుందని, బీఫ్ గురించే మాట్లాడితే తాము ఊరుకోమని హెచ్చరించారు.

బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ... గోహత్యకు తాము వ్యతిరేకమని, ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కమ్యూనల్ హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం ఒవైసీ చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ నిషేధిత అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ టీడీపీ
నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని టీడీపీ కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ గుర్తు పైన గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తిరిగి పోటీ చేయాలన్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications