తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్, నిరవధిక దీక్ష భగ్నం

ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయం చేయాడంతోపాటు, మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ,నిరవధిక దీక్షకు దిగిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, అయన దీక్షను భగ్నం చేశారు. అనంతరం గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా లక్ష్మణ్ ఇంటర్ బోర్డు వద్ద కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షచేపట్టారు. అయినా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తన అరెస్ట్ ను ఖండించిన లక్ష్మణ్, తమ డిమాండ్‌లు నెరవేరేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.

 BJP state president Dr. k laxman arrest

అంతకుముందు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన చేస్తున్న జనసేన తోపాటు వామపక్షాల నాయకుల్ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ మరియు కాంగ్రెస్ నేతల కూడ బయటకు రాకుండా కట్టడి చేశారు. కాగా ఇంటర్ బోర్డు అవకతవకలపై బోర్డు ముట్టడికి అఖిలపక్షం తోపాటు ఏబీవీపీ లు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈనేపథ్యంలోనే పలు చోట్ల అఖిలపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ ల పర్వం పోలీసులు తకొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+